‘టాక్సిక్‌’… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తెలుగు హ‌క్కుల‌ను శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూ.120 కోట్ల‌కు సొంతం చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

రాకింగ్ స్టార్ య‌శ్ ప్రెస్టీజియ‌స్ పాన్ ఇండిమా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’. మార్చి 19న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు సంబంధించిన హ‌క్కుల‌ను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ క‌మీష‌న్ బేసిస్‌)కు సొంతం చేసుకోవ‌టం ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డీల్‌గా మారింది.

ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీగా టాక్సిక్ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో టాక్సిక్ నిర్మాత‌ల(కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్‌)కు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌కు మ‌ధ్య ఈ హిస్టారిక‌ల్ డీల్‌తో సినిమాపై బ‌జ్ మ‌రింత‌గా పెరిగింది. సినిమా రూపొందుతోన్న స్కేల్‌, సినిమాపై ఉన్న క్యూరియాసిటీ, బాక్సాఫీస్ రేంజ్‌పై ట్రేడ్‌పై ఉన్న గ‌ట్టి న‌మ్మ‌కాన్ని ఇది మ‌రింత స్ప‌ష్టంగా తెలియ‌జేస్తోంది. ఏపీ, తెలంగాణ హ‌క్కుల కోసం మూడు అగ్ర సంస్థ‌లు పోటీ ప‌డ‌గా చివ‌ర‌కు దిల్ రాజు నేతృత్వంలోని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌కు ఈ డీల్ ద‌క్కింది. దీంతో ఇటీవ‌ల ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో అత్యంత కీల‌క‌మైన డిస్ట్రిబ్యూష‌న్ డీల్స్‌లో ఒక‌టిగా నిలిచింది.

రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ సినిమా అనేది నిజమైన స్టార్ పవర్, విజన్, భారీ స్థాయి సినీ ఆలోచ‌న ఉంటే భాష ప‌ర‌మైన హ‌ద్దులు ఎలా తొలగిపోతాయోన‌ని చూపించే బ‌ల‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. బ‌య‌ట‌కు క‌నిపిస్తోన్న మూవీకున్న‌ హైప్‌, దేశాలు దాటిన అభిమానుల నుంచి వ‌స్తోన్న రెస్పాన్స్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌స్తోన్న భారీ స్పంద‌న ఇవ‌న్నీ చూస్తుంటే సినిమా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచే దీనికి ఊహించ‌ని స్థాయిలో భారీ బ‌జ్ క్రియేట్ అయ్యింద‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తున్నాయి. ప్రాంతాల‌కు అతీతంగా య‌శ్‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ చూస్తుంటే ఓ స్టార్ హీరో కోసం దేశం యావ‌త్తు ఏక‌మ‌వుతోంద‌నే అరుదైన ఫీలింగ్ క‌లుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్ష‌కులైతే య‌శ్‌ను మ‌న‌వాడ‌నే అభిమానంతో ఆదరిస్తున్నారు. కెజియ‌ఫ్ 2 త‌ర్వాత య‌శ్ నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌నే విష‌యం ఇప్పుటికే నెంబ‌ర్స్ రూపంలో, ప్రీ రిలీజ్ హైప్ రూపంలో స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోని పెద్ద స్టార్స్‌లో య‌శ్ ఒక‌రు. కెజియ‌ఫ్ 2 త‌ర్వాత ఆయ‌న మార్కెట్ మ‌రింత‌గా పెరిగింది. ఆయ‌న నెక్ట్స్ సినిమా టాక్సిక్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. నాలుగేళ్ల త‌ర్వాత వ‌స్తోన్న ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి ప్రెస్టీజియ‌స్ మూవీని మా ఎస్‌వీసీ బ్యాన‌ర్‌పై తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానుండ‌టం చాలా ఆనందంగా ఉంది. య‌శ్‌తో ఇలాగే మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు.

శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌తో భాగ‌స్వామ్యం కావ‌టం వ‌ల్ల టాక్సిక్ సినిమాపై న‌మ్మ‌కం మ‌రింత‌గా పెరిగింది. అందుకు కార‌ణం దిల్ రాజు నేతృత్వంలోని ఎస్‌వీసీ బ్యాన‌ర్‌కు ఎన్నో భారీ చిత్రాలు, కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను రూపొందించి ఘ‌న విజ‌యాల‌ను సాధించింది. నేష‌న‌ల్ అవార్డ్స్ సాధించిన సినిమాలు, బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించిన సినిమాల‌ను రూపొందించిన ఈ సంస్థ‌పై ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి న‌మ్మ‌కం ఉంది. టాక్సిక్ సినిమాతో ఎస్‌వీసీ బ్యాన‌ర్ జ‌త క‌ట్ట‌టం అనేది క‌థ‌, స్కేల్‌, భారీగా థియేట‌ర్స్‌లో సినిమా ర‌న్ కావ‌టం అనే అంశాల‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని మ‌రింత స్ప‌ష్టం చేసింది. సినీ ఇండ‌స్ట్రీకి ఏపీ, తెలంగాణ ప్రాంతాలు ఎంతో కీల‌క‌మైన‌వి. కార‌ణం, ఇక్క‌డ సినిమాను ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. కాబ‌ట్టి ఈ భాగ‌స్వామ్యం టాక్సిక్ సినిమా ప్ల‌స్ అయ్యింది. ఈ పార్ట్‌నర్‌షిప్‌తో ప్రేక్షకులకు భారీ రిలీజ్‌, స్ట్రాంగ్ ప్రమోషన్లు, థియేటర్‌లో ఫుల్ మాస్ ఫీలింగ్ గ్యారంటీ అనే ఫీలింగ్ వచ్చింది.

యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచ‌నాలున్నాయి.

అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు టాక్సిక్ సినిమాకు వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు.

‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్‌ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago