గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథగా నిలిచింది. డైరెక్టర్ మోహిత్ సూరి, నిర్మాత క్షయ్ విధాని(యశ్ రాజ్ ఫిల్మ్స్ సి.ఇ.ఒ), అలాగే జెన్ Z స్టార్స్ అహన్ పాండే, అనీత్ పద్దా కలయికలో మరోసారి ఇంటెన్స్ లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. హృదయాన్ని హత్తుకునే కథనం, మరచిపోలేని మెలోడీలతో ఈ సినిమా ఓ ప్రత్యేకమైన సినీ అనుభవాన్ని తప్పకుండా అందిస్తుందనే హామీ ఇస్తోంది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన సైయారా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది.రీసెంట్ టైమ్‌లో అత్యంత ప్రభావవంతమైన మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. ఇండియాలో సుమారు రూ.338 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.580 కోట్ల గ్రాస్ వసూళ్లను సినిమా సాధించింది. పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ మ్యూజికల్‌గా అసాధారణమైన విజయాన్ని అందుకుంది. సినిమాలో హృదయాలను హత్తుకునే పాటలను ప్రేక్షకులను మెప్పించాయి. స్ట్రీమింగ్ చార్ట్స్‌లో ఈ సాంగ్స్ టాప్‌లో నిలిచాయి. దీంతో ఈ సినిమా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా నేటి యువతలో, ఒక పాప్ కల్చర్ ఫెనామెనాన్‌గా తన ప్రభావాన్ని బలంగా చూపింది.
అహన్ పాండే, అనీత్ పద్దా జంటగా నటించిన సైయారా జెన్ జీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దీంతో వీరిని అభిమానులు ప్రేమగా “Ahneet” అని పిలిచారు.సైయారాలో వారి మధ్య కనిపించిన చక్కటి కెమిస్ట్రీ, సహజమైన నటన, ఎనర్జీ ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయే అనుభవాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరోసారి కొత్త చిత్రంతో వారు మళ్లీ రాబోతుండటంతో, అదే చార్మ్, నటన, స్క్రీన్‌పై మళ్లీ కనిపించబోయే కెమిస్ట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ ‘‘నేను ప్రేమకథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. భావోద్వేగాలు అతి తీవ్రంగా, నియంత్రణలో లేని స్థితిలో ఉండి, వ్యక్తిని పూర్తిగా ఆక్రమించేసేలా ఉంటే నాకు అవి మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి. ప్రేమను గాఢమైన భావనగా నేను భావిస్తాను, అందుకే కథకుడిగా నేను సహజంగానే ఈ జోనర్‌ను ఇష్టపడతాను. మేం చేయబోతోన్న కొత్త సినిమా అలాంటి భావాన్ని అందిస్తుంది. సైయారాలో పనిచేసిన అదే టీమ్‌తో మళ్లీ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. దీన్ని గమనిస్తుంటే ఈ కలయికను మరోసారి విధి రాసిందేమోననిపిస్తోంది. మా కలయికను చూస్తుంటే… ఇంటికి తిరిగి వచ్చినట్లే అనిపిస్తోంది… కానీ కొత్త సృజనాత్మకతను జోడించి కొత్తదనంతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ కథను చేయటం ఉత్సాహంగా ఉన్నప్పటికీ కాస్త టెన్షన్ కూడా ఉంది. నా సినిమాల ద్వారా ఎప్పుడూ ప్రయత్నించినట్లే, ఈసారి కూడా నా సంగీతం మళ్లీ ప్రేక్షకుల హృదయాలను మెప్పించాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
అక్షయ్ విధాని మాట్లాడుతూ ‘‘ మోహిత్ సూరితో మా సహకారం ఎప్పుడూ ఒకే క్రియేటివ్ వైబ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల హృదయాలను తాకే కథలు చెప్పాలనేది మా ఆకాంక్ష. మోహిత్‌తో పని చేయడం అంటే కేవలం ఒక సినిమా చేయడం కాదు.. అది ఒక భావాన్ని వెతకడం, ఒక సంగీత క్షణాన్ని పట్టుకోవడం, సినిమా ముగిసిన తర్వాత కూడా మనసులో నిలిచిపోయే అనుభూతిని సృష్టించడం. సైయారా అలాంటి ఒక అనుభవం. దాన్ని మేము ఎప్పటికీ మరిచిపోలేం. ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేస్తున్నప్పుడు, మేము ఇంకా ఎక్కువ నిజాయితీతో, మరింత భావోద్వేగంతో, మరింత లోతైన కథతో రాబోతున్నాం. మళ్లీ మా కలయిక మరింత సున్నితమైన, మరింత నిలిచిపోయే అనుభవాన్ని ఇవ్వాలన్నదే లక్ష్యం. ఈ చిత్రంలో అహన్ పాండే, అనీత్ పద్దా భాగం కావటం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ మెచ్చిన ఈ జెన్ జీ జోడీ మళ్లీ ఒక మోహిత్ సూరి రొమాన్స్ కోసం కలవడం నిజంగా ప్రత్యేకమైన విషయంగానే చెప్పాలి.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అహన్, అనీత్ జోడీగా రూపొందనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. 2027లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…