ది మేజ్” చిత్రంతో దర్శకుడిగా
డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్ డాక్టర్ గా తన వృత్తిలో కీర్తి ప్రతిష్టలు గడించి ఇప్పుడు దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. శ్రీరామ్ (శ్రీకాంత్) హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో “ది మేజ్” చిత్రాన్ని తన తొలి ప్రయత్నంగా తెరకెక్కిస్తున్నారు. రవికిరణ్ గడలాయ్ గతంలో “ది రాంగ్ స్వైప్” అనే షార్ట్ ఫిలింను తన ఫోన్ తో తెరకెక్కించారు. ఈ లఘుచిత్రం రూపొందించే క్రమంలో కథ చెప్పే విధానం, కెమెరా, నటన, సన్నివేశ నిర్మాణం, ఎడిటింగ్ వంటి అంశాలపై అవగాహన తెచ్చుకున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా డైరెక్టర్ డా.రవికిరణ్ గడలాయ్ పాత్రికేయులతో ముచ్చటించారు.
డా. రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ – నేను ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యే ముందు ఇండస్ట్రీలో నా అనుభవం కూడా చాలా తక్కువే. కానీ చిన్నప్పటి నుంచే ఒక సినిమా తీయాలనే కల ఉండేది. ఎన్నో సినిమాలు చూస్తూ, వాటిని విశ్లేషిస్తూ, నా మొబైల్‌తోనే ప్రాక్టీస్ చేస్తూ సినిమా భాషను నేర్చుకున్నాను. ఎడిటింగ్‌పై ఉన్న అవగాహన వల్ల ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించుకోగలిగాను. అదే దర్శకత్వాన్ని నాకు మరింత సులభం చేసింది. ఫిలింమేకింగ్ లో దర్శకులు అకిరా కురోసావా, సెల్వరాఘవన్, సందీప్ రెడ్డి వంగా నాకు స్ఫూర్తినిస్తుంటారు. ఇప్పుడు “ది మేజ్” చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నం చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
“ది మేజ్” మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవం–భ్రమ మధ్యనున్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతి క్షణం మీ ఆలోచనలను సవాలు చేసే, జెయింట్ వీల్ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
నటీనటులు – శ్రీరామ్ (శ్రీకాంత్), ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు, తదితరులు
ఆర్ట్ డైరెక్టర్ – రాజు అడ్డాల
ఎడిటర్ – సత్య గిడుతూరి
డీవోపీ – శివ కృష్ణ
మ్యూజిక్ – శ్రావణ్ భరద్వాజ్
సమర్పణ – డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి
బ్యానర్స్ – యూఆర్ క్రియేషన్స్ , శ్రౌష కమల ఆర్ట్స్,
కో ప్రొడ్యూసర్స్ – డాక్టర్ విక్రమ్ సింగిరికొండ, బండ సురేందర్ రెడ్డి, ఎన్. విజయ్ ఎస్ రెడ్డి, కరెడ్డి రఘువంశీ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ
స్క్రిప్ట్, డైరెక్షన్ – డాక్టర్ రవికిరణ్ గడలాయ్
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్. మీడియా)
‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.…
ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy…
▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా…
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…
నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…