ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల హీరో మంచు మనోజ్ విడుదల చేశారు. సస్పెన్స్‌తో పాటు వినోదానికి ప్రాధాన్యమిస్తూ దర్శకుడు జి. మధుసూదన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ ను చిత్ర యూనిట్ లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది, సోషల్ మీడియాలో టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది, “మంచి కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘ఫ్రెండ్లీ ఘోస్ట్’ త్వరలో థియేటర్లలో రానుంది. నిర్మాత విశ్వనాథ్.డి.కె , దర్శకుడు జి. మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను అందరికీ నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు.
భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, మధు నందన్, చమ్మక్ చంద్ర, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే పాటలు, ట్రైలర్ వరుసగా విడుదల చేయనున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది.
‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.…
ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy…
▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా…
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…
నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…