ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ విడుదల !!!

Must Read

ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల హీరో మంచు మనోజ్ విడుదల చేశారు. సస్పెన్స్‌తో పాటు వినోదానికి ప్రాధాన్యమిస్తూ దర్శకుడు జి. మధుసూదన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

తాజాగా ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ ను చిత్ర యూనిట్ లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది, సోషల్ మీడియాలో టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది, “మంచి కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘ఫ్రెండ్లీ ఘోస్ట్’ త్వరలో థియేటర్లలో రానుంది. నిర్మాత విశ్వనాథ్.డి.కె , దర్శకుడు జి. మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను అందరికీ నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు.

భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, మధు నందన్, చమ్మక్ చంద్ర, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే పాటలు, ట్రైలర్ వరుసగా విడుదల చేయనున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది.

Latest News

ఘనంగా ‘శివ గాడి జింద‌గీ’ మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జింద‌గీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న...

More News