భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, భారత్‌లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానులు చేపట్టిన #OpenDoomsdayBookings ప్రచారానికి స్పందించిన మార్వెల్ సంస్థ టికెట్ బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. రోజంతా వివిధ సమయాల్లో షోలు అందుబాటులో ఉండటంతో అభిమానులు మొదటి రోజు మొదటి షో టికెట్ల కోసం పోటీపడుతున్నారు.

ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ డాలర్లను దాటినట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుదలైన తొలి ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 503 మిలియన్ల వ్యూస్ సాధించి, ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్లలో రెండో స్థానంలో నిలిచింది.

భారతీయ ప్రేక్షకులకు మరో ప్రత్యేకమైన కానుకగా, అమెరికా విడుదల కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా మన దేశంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో మార్వెల్ స్టూడియోస్ ప్రెజెంట్స్ ఇన్ఫినిటీ విజన్‌తో పాటు ఇతర ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

సూపర్ హీరోల మధ్య జరగబోయే భారీ పోరాటాన్ని వెండితెరపై చూసేందుకు సిద్ధమవ్వండి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన నేపథ్యంలో వెంటనే మీ టికెట్లను బుక్ చేసుకుని, ఈ అద్భుతమైన సినిమాను తొలిరోజే వీక్షించండి.

TFJA

Recent Posts

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు.. 2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి..!

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…

13 hours ago

ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం..!

‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…

13 hours ago

ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మ‌య‌స‌భ‌’ చరిత్ర!

57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…

13 hours ago

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…

1 day ago

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

2 days ago

‘ఓం’ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మమ్ముట్టి..!

మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు సెలెబ్రేట్ చేసుకునేలా ‘ఓం’ సినిమా ఉంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్…

2 days ago