Categories: Uncategorized

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం – సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ

AI ఆధారిత డీప్‌ఫేక్‌లు, డిజిటల్ వ్యక్తిత్వ దుర్వినియోగం, అనుమతి లేకుండా కళాకారుల ముఖం, గొంతు, సృజనాత్మక కృషిని ఉపయోగించడాన్ని అరికట్టేందుకు పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి అధికారిక వినతిపత్రం అందజేశారు. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి, కేంద్ర హోం మరియు సమాచార–ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించి ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.

చిత్ర పరిశ్రమకు ఎప్పుడు అవసరం వచ్చినా ముందుండి అండగా నిలిచే వ్యక్తి చిరంజీవి గారు. కరోనా సంక్షోభ సమయంలో సినీ కార్మికులకు చేయూతనందించడం నుంచి హెల్త్ కార్డులు, వైద్య సహాయం, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం వరకు… పరిశ్రమ సంక్షేమం పట్ల ఆయన తన బాధ్యతను అనేక సందర్భాల్లో చాటుకున్నారు. రక్తదానం, నేత్రదానం కార్యక్రమాల ద్వారా సమాజానికీ సేవలందిస్తున్నారు. అదే బాధ్యతతో ఇప్పుడు డిజిటల్ దుర్వినియోగం నుంచి కళాకారుల గౌరవం, జీవనోపాధి, సృజనాత్మక హక్కులను కాపాడేందుకు మరోసారి ముందుకొచ్చారు.

ఇటీవల శ్రీ అమిత్ షా గారితో జరిగిన సమావేశంలో, AI దుర్వినియోగం వల్ల సినీ, టెలివిజన్ కళాకారుల గౌరవం, ప్రతిష్ఠ, వృత్తిపరమైన హక్కులకు ఎదురవుతున్న ముప్పును చిరంజీవి గారు వివరించారు. ఆ సందర్భంగా శ్రీ అమిత్ షా గారు సూచించిన మేరకు, లిఖితపూర్వక వినతిపత్రాన్ని శ్రీ కిషన్ రెడ్డి గారికి అందజేశారు. ఇందులోని అంశాలను సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి, ప్రతిపాదించిన చర్యలపై సమన్వయం చేస్తానని శ్రీ కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.

వ్యక్తుల గుర్తింపు, రూపం, గొంతుకు చట్టపరమైన రక్షణ, డిజిటల్ పునఃసృష్టికి ముందస్తు సమ్మతి, దురుద్దేశపూర్వక వినియోగంపై తగిన శిక్షలు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను నిర్ణీత గడువులో తొలగించే వ్యవస్థలను వినతిపత్రంలో కోరారు. సృజనాత్మక హక్కుల పరిరక్షణ, ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, దుర్వినియోగానికి అవకాశం కల్పించే ప్లాట్‌ఫారమ్‌లు, సేవల ప్రదాతలకు బాధ్యత నిర్ధారించడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.

దశాబ్దాల కృషితో సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు క్షణాల్లో దెబ్బతినే ప్రమాదం ఉన్నందున సత్వర స్పందన, సమర్థవంతమైన అమలు అవసరమని చిరంజీవి గారు పేర్కొన్నారు. ఈ సమస్య ప్రముఖులకే పరిమితం కాదని, సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులు సైతం మోసాలు, వేధింపులు, వ్యక్తిత్వ దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు.

“సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలి… మనిషి గౌరవాన్ని దెబ్బతీయకూడదు” అని వినతిపత్రంలో స్పష్టం చేశారు.

వ్యక్తిగత హోదాలో ఈ వినతిపత్రాన్ని సమర్పించిన చిరంజీవి గారు, ప్రభుత్వ పరిశీలన, శ్రీ కిషన్ రెడ్డి గారి సమన్వయంతో కళాకారులు, సృజనాత్మక వృత్తిదారులతో పాటు ప్రజలందరికీ మెరుగైన రక్షణ లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

TFJA

Recent Posts

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

12 hours ago

‘ఓం’ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మమ్ముట్టి..!

మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు సెలెబ్రేట్ చేసుకునేలా ‘ఓం’ సినిమా ఉంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్…

13 hours ago

ఆది సాయికుమార్, 7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్ పీ, డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ కాంబో సినిమా “అరుంధతి నక్షత్రం” ఘనంగా ప్రారంభం..!

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అరుంధతి నక్షత్రం". ఈ సినిమాలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్…

1 day ago

నవంబర్ 20న విడుదలవుతోన్న ‘మన డాక్టర్ బాబే’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్..!

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు అలీ శరణ్య,…

1 day ago

సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు TFJA ప్రతినిధుల జన్మదిన శుభాకాంక్షలు..!

అందరి బంధువు, చిత్రపరిశ్రమ శ్రేయోభిలాషి, కార్మికుల పాలిట పెన్నిధి, చిన్న నిర్మాతల పక్షపాతి, సినీ జర్నలిస్టుల ఆత్మీయుడు అయిన సీనియర్…

2 days ago

31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న ‘నమస్తే వరల్డ్..!

· కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాల ఏర్పాటుతో 1,050 మందికి ఉపాధి అవకాశాలు ·…

4 days ago