అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.’మీర్జాపురంరాణి -కృష్ణవేణి’ పుస్తకాన్ని రచయిత భగీరథ, నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవి వెంకయ్య నాయుడుకి బహుకరించారు .
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ … “తెలుగు సినిమా ప్రారంభ రోజుల్లో బాల నటిగా ప్రవేశించి, కథానాయికగా ఎదిగిన కృష్ణవేణమ్మ మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది” అని చెప్పారు.
“కృష్ణవేణమ్మ కేవలం నటి, గాయనిగానే కాదు అభిరుచి కలిగిన నిర్మాత, ఎన్నో సందేశాత్మక సినిమాలను రూపొందించారు. ముఖ్యంగా ఎన్ .టి . రామారావు ని ‘మనదేశం ‘సినిమాతో పరిచయం చేశారు. అందుకే ఆమె అంటే నాకు గౌరవం” అని వెంకయ్య నాయుడు చెప్పారు. “అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి వెంకట్రామయ్య, సిహెచ్.నారాయణ రావు, ఘంటసాల, రమేష్ నాయుడు, త్రిపురనేని గోపీచంద్, తాపీ ధర్మారావు, చిత్రపు నారాయణ మూర్తి లాంటి వారికి చేయూత నిచ్చిన కృష్ణవేణమ్మ చిరస్మరణీయురాలు” అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు .
విజయవాడలో 2024 డిసెంబర్14న ‘మనదేశం’ సినిమా వజ్రోత్సవ వేడుకలు , ‘తారకరామం’ పుస్తకావిష్కరణ సభలో తాను, ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కలసి కృష్ణవేణమ్మను సత్కరించామని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు .
“మీర్జాపురంరాణి -కృష్ణవేణి ” పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను, నిర్మాత ఎన్ .ఆర్ .అనురాధాదేవి ని వెంకయ్య నాయుడు అభినందించారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…