ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను “మా వందే” టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోంది. “మా వందే” చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మొదటి షెడ్యూల్ షూటింగ్ లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఫొటోస్ ను మూవీ టీమ్ షేర్ చేసింది. “మా వందే” టీమ్ మెంబర్స్ నెక్ట్స్ షెడ్యూల్ కోసం కాశ్మీర్ వెళ్తున్నారు.
“మా వందే” సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ 400 కోట్ల రూపాయలకు పైగా హ్యూజ్ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ స్టోరీ డ్రివెన్ మూవీని ప్రపంచంలో తొలిసారిగా తొలిసారి ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్ లో హీరోగా నటించిన జేసన్ మమొవాను “మా వందే” చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.
నటీనటులు – ఉన్ని ముకుందన్, రవీనా టండన్, జగపతి బాబు, శరత్ కుమార్, తదితరులు
యాక్షన్ – కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – సాబు సిరిల్
ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్
డీవోపీ – కె.కె. సెంథిల్ కుమార్
మ్యూజిక్ – రవి బస్రుర్
బ్యానర్ – సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – గంధాధర్ ఎన్ఎస్, వాణిశ్రీ .బి.
లైన్ ప్రొడ్యూసర్ – టీవీఎన్ రాజేశ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్ – వాల్స్ అండ్ ట్రెండ్స్
నిర్మాత – వీర్ రెడ్డి.ఎం.
రచన, దర్శకత్వం – క్రాంతికుమార్.సి.హెచ్.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…