భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో…
డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘యుఫోరియా’ మూవీ సినిమాకు మార్నింగ్ షో నుంచే మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ టైటిల్ చూసి యూత్ వస్తారని అనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తున్నారు. భూమికగారు, సారా అర్జున్ అందుకు కారణం కావచ్చు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా నుంచి ఏదైతే ఆశించామో అది వస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ పంథాలో కాకుండా, ఎలాంటి ఫార్ములా ఫాలో కాకుండా హార్డ్ హిట్టింగ్ చెప్పాలని అనుకునే ప్రయత్నించాం. దానికి మంచి స్పందన వస్తుంది. మిత్రులందరి నుంచి అభినందిస్తున్నారు. రెగ్యులర్ ఫార్మేట్‌ను వదిలేసి కొత్త నటీనటులతో ఇంత పెద్ద స్కేల్‌లో సినిమా చేయటం సాహసమని అందరూ భావిస్తున్నారు. ఇంత బోల్డ్ కంటెంట్‌ను ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు అభినందించేలా సినిమాను చేశామని అంటున్నారు. గుణశేఖర్‌ను కొత్తగా చూస్తున్నామని అప్రిషియేట్ చేస్తుంటే చాలా గొప్ప ప్రశంసగా అనిపిస్తుంది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని యుఫోరియాతో ప్రయత్నించాను. ఆ ప్రయత్నాన్ని ఈరోజు చాలా మంది అభినందిస్తున్నారు. ఓ కొత్త దర్శకుడిలా ఆలోచించి తీశానని అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముందు నుంచి అడోలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్ అనే అంశాలను చక్కగా రియలిస్టిక్‌గా, కమర్షియల్ అప్రోచ్‌తో రూపొందించాం. తల్లి కొడుకు మధ్య ఉన్న సంఘర్షణను చూపించాం. సినిమా సెకండాఫ్‌లో ఉత్కంఠతను ఎంజాయ్ చేస్తున్నామని ఫ్యామిలీ ఆడియెన్స్ చెబుతున్నారు. ఈ మధ్య ఇలాంటి స్టాండర్డ్ క్లైమాక్స్‌ను చూడలేదని ప్రేక్షకులు అంటున్నారు. తొలి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు సినిమా ఎంగేజింగ్‌గా నడిచింది. మా సినిమాను ప్రేక్షకులతో పాటు రివ్యూవర్స్ కూడా చక్కగా అర్థం చేసుకుని విశ్లేషించారు. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సింది. మౌత్ టాక్‌ను మేం నమ్ముతాం. దాన్ని మరింత పాజిటివ్‌గా అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఇంటిల్లిపాది అందరూ చూడటం కోసం మేం అందం చేసిన సినిమా’’ అన్నారు.
పృథ్వీ అడ్డాల మాట్లాడుతూ ‘‘ఉదయం నుంచి ‘యుఫోరియా’ మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. హార్డ్ హిట్టింగ్, బోల్డ్ మూవ్. గుణశేఖర్‌గారి డేర్ ఏంటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉందని అంటున్నారు. ఇక సెకండాఫ్‌లో తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి సంతోషంగా అనిపించింది. ఇలాంటి సినిమాతో మీ ముందుకు సైకో సాహిల్‌గా రావటం మంచి ఎక్స్‌పీరియెన్స్. అందరికీ థాంక్స్’’ అన్నారు.
విఘ్నేశ్ గవిరెడ్డి మాట్లాడుతూ ‘‘మార్నింగ్ షోస్ చూసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నామని అప్రిషియేట్ చేస్తున్నారు. ‘యుఫోరియా’ సినిమాను గుణశేఖర్‌గారు చాలా కొత్తగా తెరకెక్కించారని అందరూ అంటున్నారు. నాతోపాటు కొత్తగా నటించిన ఇతర నటీనటులు, భూమికగారు, సారా అందరూ చక్కగా నటించారు. దీన్ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఫస్టాఫ్ అంతా థ్రిల్లర్‌లా అయ్యిందని, సెకండాఫ్ అంతా తల్లి కొడుకుల మధ్య సంఘర్షణను చూపించారు. సినిమాను అందరూ థియేటర్స్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన గుణ శేఖర్‌గారికి థాంక్స్’’ అన్నారు.
నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘యుఫోరియా సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ నాకు చేస్తోన్న ఫోన్స్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ సినిమాకు ఎంతో కనెక్ట్ అయ్యారు. అమ్మాయిలు, అమ్మలు.. కనెక్ట్ అవుతున్నారు. వైజాగ్, నర్సిపట్నం ఏరియాల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. మంచి రివ్యూస్ వచ్చాయి. తల్లి, కొడుకు మధ్య ఉన్న బంధం, సంఘర్షణను చక్కగా చూపించారని అంటున్నారు. క్లైమాక్స్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. విఘ్నేష్, పృథ్వీ, లిఖిత పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. భూమికగారు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సారా అర్జున్ బ్రలియంట్ పెర్ఫామర్. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…