ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించిన
శ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు .. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో పాటు తనకు భారీ మెజారిటీ వచ్చిన వైనాన్ని సభ్యులతో పంచుకున్నారు. కోశాధికారిగా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని. దానితో పాటు .. ఎన్నుకోబడ్డ కార్యవర్గం మొత్తం చిత్త శుద్దితో నిర్మాతలకు మేలు జరిగే అనేక కార్యక్రమాలు చేయనున్నాము.. చిన్న నిర్మాతలకు మేలు జరిగే అన్ని కార్యక్రమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.. ఈ విషయంలో ఎవ్వరికీ భయ పడే ప్రసక్తేలేదు.. చరిత్రలో నిలిచి పోయే విధంగా మా సేవలు ఉంటాయని అన్నారు.
గతంలో జర్నలిస్టులకు ప్రకటించిన టవర్ కు సంబందించిన హామీ పై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దానికి సంబందించిన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నాము. ఈ ఏడాదిలోనే భూమి పూజ జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ సీనియర్ సభ్యులు ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు, కొండపనేని ఉమా మహేశ్వరరావు,బాలిరెడ్డి, ఫిలింక్రిటిక్స్ కార్యవర్గ సభ్యులు మామిడిపల్లి గిరిధర్, చందురమేష్, పర్వీన్ బాబి, నవీన్, కుమార స్వామి, ఫిలింక్రిటిక్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావులు పాల్గొన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…
యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…