చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

Must Read

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించిన
శ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు .. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో పాటు తనకు భారీ మెజారిటీ వచ్చిన వైనాన్ని సభ్యులతో పంచుకున్నారు. కోశాధికారిగా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని. దానితో పాటు .. ఎన్నుకోబడ్డ కార్యవర్గం మొత్తం చిత్త శుద్దితో నిర్మాతలకు మేలు జరిగే అనేక కార్యక్రమాలు చేయనున్నాము.. చిన్న నిర్మాతలకు మేలు జరిగే అన్ని కార్యక్రమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.. ఈ విషయంలో ఎవ్వరికీ భయ పడే ప్రసక్తేలేదు.. చరిత్రలో నిలిచి పోయే విధంగా మా సేవలు ఉంటాయని అన్నారు.
గతంలో జర్నలిస్టులకు ప్రకటించిన టవర్ కు సంబందించిన హామీ పై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దానికి సంబందించిన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నాము. ఈ ఏడాదిలోనే భూమి పూజ జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ సీనియర్‌ సభ్యులు ట్రేడ్‌ గైడ్‌ వెంకటేశ్వరరావు, కొండపనేని ఉమా మహేశ్వరరావు,బాలిరెడ్డి, ఫిలింక్రిటిక్స్ కార్యవర్గ సభ్యులు మామిడిపల్లి గిరిధర్‌, చందురమేష్‌, పర్వీన్‌ బాబి, నవీన్‌, కుమార స్వామి, ఫిలింక్రిటిక్స్ ప్రధాన కార్యదర్శి సురేష్‌ కొండేటి, అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావులు పాల్గొన్నారు.

Latest News

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా,...

More News