సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను వదిలారు. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ని మేకర్స్ రూపొందించారు.

‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఇక సంతోష్ నారాయణన్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఇందులో సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్‌గా మార్చేసింది.

‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడతాయి. ఇక రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ రాబోతోంది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 15న విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు : సమంత, దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య, శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్
నిర్మాతలు : సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
స్టోరీ, స్క్రీన్ ప్లే : రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్
దర్శకత్వం : నందినీ రెడ్డి
కెమెరామెన్ : ఓం ప్రకాష్
సంగీతం : సంతోష్ నారాయణన్
యాక్షన్ : లీ విట్టేకర్, ఏజాజ్ గులాబ్
ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల
ప్రొడక్షన్ డిజైన్ : ఉల్లాస్ హైదుర్
పీఆర్వో : వంశీ కాకా

TFJA

Recent Posts

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

3 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

3 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

1 day ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

1 day ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

1 day ago

బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్ నభా నటేష్

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ల క్రితం ఆమె భుజానికి గాయమైంది.…

1 day ago