10 నిమిషాల నుంచి 10 కోట్ల వరకు.. విష్ణు మంచు సాహసోతమైన నిర్ణయం

ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు విష్ణు మంచు సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్ ఈ మేరకు కొత్త ఏడాది సందర్భంగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇండియా వైడ్‌గా ఉన్న కొత్త టాలెంట్, న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ అవా ఎంటర్టైన్మెంట్ ఆహ్వానం పలుకుతోంది. రూటెడ్ స్టోరీలు చెప్పే విజన్, క్రియేటివిటీ ఉన్న న్యూ మేకర్లని ఒక చోటకు చేర్చాలని విష్ణు మంచు ప్రయత్నిస్తున్నారు.

దానిలో భాగంగా కొన్ని ఆలోచనల్ని పంచుకున్నారు. ఓ పది నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం కూడా మన జీవితాన్ని మార్చేయగలదు. చిన్నగా ప్రారంభైన ప్రయాణమే గొప్ప స్థాయికి వెళ్లొచ్చు. ఓ గొప్ప సినిమా అనేది దాని స్కేల్ లేదా నేపథ్యం నుంచి కాకుండా.. ఆలోచన, అందులోని స్పష్టత, భావోద్వేగం, సృజనాత్మకసృజనాత్మకత నుంచి పుడుతుందని అవా ఎంటర్‌టైన్‌మెంట్ నమ్ముతోంది. ఇది ఒక సాధారణ పోటీ లేదా సాంప్రదాయ లాంచ్‌ప్యాడ్ కాదు. పరిశ్రమపై లోతైన అవగాహన, అనుభవం, స్పష్టమైన ఉద్దేశంతో రూపొందించిన ఒక ప్రత్యేకమైన అవకాశం.

సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి మార్గం తెలియని వారి కోసం విష్ణు మంచు విశ్వసనీయత, పారదర్శకత, రానున్న న్యూ జనరేషన్ సృష్టికర్తలకునిజమైన అవకాశాన్ని అందించడానికి ముందడుగు వేస్తున్నారు. మరిన్ని వివరాలను జనవరి 15న అధికారికంగా వెల్లడించనున్నారు. అప్పటి వరకు అవా ఎంటర్‌టైన్‌మెంట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్‌‌ను అప్రమత్తంగా ఉండమని చెబుతోంది. 10 నిమిషాలు. ఒక విజన్. భవిష్యత్తు వికసించడానికి వేచి ఉంది అని చెబుతూ శక్తివంతమైనది ఏదో అందరి ముందుకు రాబోతోందని హింట్ ఇచ్చారు.

TFJA

Recent Posts

“చెన్నై లవ్ స్టోరీ” టీమ్, సమ్మర్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం, "కలర్ ఫొటో", "బేబి" మేకర్స్ కాంబో క్రేజీ మూవీ…

7 hours ago

సువర్ణ టెక్స్టైల్స్ ఫస్ట్ లుక్ విడుదల

శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్ర దారులుగా ప్రశాంత్ నామిని రచన…

8 hours ago

తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘అసుర సంహారం’ మూవీ టీజర్ విడుదల

లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ…

9 hours ago

The RajaSaab Trailer 2.0

https://www.youtube.com/watch?v=kioDUhqMEKU

22 hours ago

నూతన సంవత్సర శుభాకాంక్షలతో” ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్ ,సాయికుమార్ , నటరాజ్ వరుణ్ సందేశ్ ,వితికా షేరు, ప్రధాన…

22 hours ago

తెలుగులో యాక్షన్ థ్రిల్లర్ ‘ది టాస్క్’

డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడంలో రూపొందిన 'ది టాస్క్' చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే…

22 hours ago