మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ జనవరి 4న రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు’, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, ‘శశిరేఖ’ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేష్ నటించిన  పాట ‘సంక్రాంతి అదిరిపోద్ది’ ఒక ఫెస్టివల్ సాంగ్ లా మారింది.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి తెల్లటి చొక్కా, ముదురు రంగు ప్యాంటు ధరించి, ఒక మోకాలిపై కూర్చుని, చేతిలో షాట్‌గన్ పట్టుకుని, చుట్టూ యాక్షన్‌లో ఉన్న వ్యక్తుల మధ్య కనిపించడం అదిరిపోయింది.

అనిల్ రావిపూడి ఇప్పటికే ఇది హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని హింట్స్ నేపథ్యంలో ట్రైలర్‌  కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరీన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి విజువల్స్‌ను అందిస్తుండగా, తమ్మిరాజుఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ రైటర్స్.

మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12, 2026న థియేటర్లలోకి గ్రాండ్‌గా  విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన యూఎస్‌ఏ అడ్వాన్స్ సేల్స్ అద్భుతంగా ప్రారంభమయ్యాయి.  వేగంగా100K నమోదు కావడం, ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాపై ఉన్న మ్యాసీవ్ బజ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు – సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ – శ్రీమతి అర్చన
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
డీవోపీ – సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ – తమ్మిరాజు
రచయితలు – ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ – సత్యం బెల్లంకొండ
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago