‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ వామ్మో వాయ్యో సాంగ్ గ్రాండ్ గా లాంచ్

మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ వామ్మో వాయ్యో సాంగ్ గ్రాండ్ గా లాంచ్

-‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ కిషోర్ తిరుమల  

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మొదటి రెండు పాటలు ఇప్పటికే అద్భుతమైన స్పందనను పొందాయి. ఇప్పుడు, మేకర్స్ మూడవ ట్రాక్‌ వామ్మో వాయ్యో ను వరంగల్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు.

భీమ్స్ సిసిరోలియో మరోసారి మాస్ ఆడియన్స్  కట్టిపడేసే సాంగ్ కంపోజ్ చేశారు. ‘వామ్మో వాయ్యో’ ఫుల్ జోష్‌తో సాగే ఫోక్ ట్రాక్‌గా నిలుస్తూ, వినగానే ఎనర్జీని ఇస్తుంది. లైవ్లీ ఆర్కెస్ట్రేషన్ పాటకు ప్రాణం పోస్తే, స్వాతి రెడ్డి అందించిన ప్రత్యేకమైన వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆమె వాయిస్‌లో ఉన్న ఆ ప్రత్యేక టోన్ పాటకు అదిరిపోయే ఎట్రాక్షన్ ని జోడించింది.

కలర్ ఫుల్ సెట్ డిజైన్ విజువల్స్‌ను మరింత రిచ్‌గా తీర్చిదిద్దుతూ, పాటలోని ఉత్సాహాన్ని తెరపై అద్భుతంగా ప్రజెంట్ చేసింది. దేవ్ పవార్ రాసిన లిరిక్స్‌లో రస్టిక్ ఫ్లేవర్‌తో పాటు పక్కా మాస్ టచ్ ఇచ్చింది.  శేఖర్ VJ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే హై ఎనర్జీ స్టెప్స్‌తో కిక్ ఇచ్చింది.

రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ డాన్స్‌తో మరోసారి అభిమానులను అలరించారు. ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి ఇద్దరూ గ్లామర్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ తోఆకట్టుకున్నారు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్‌ డాన్స్ ఫ్లోర్‌ను పూర్తిగా దద్దరిల్లేలా చేస్తుంది. ‘వామ్మో వాయ్యో’ ఆల్బమ్‌లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ సాంగ్‌గా అలరించింది. ఈ పాట సినిమాపై ఉన్న బజ్‌ను ఇంకో లెవల్‌కు తీసుకెళ్ళింది.

సినిమాకు ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాశ్. ఈ సంక్రాంతికి జనవరి 13న వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తప్పకుండా చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. హాయ్ వరంగల్. భద్రకాళి అమ్మవారు, రుద్రమదేవి పుట్టిన నేల ఇది. ఇక్కడికి వస్తే చాలా ధైర్యంగా అనిపించింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న రిలీజ్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్ కి వచ్చి తప్పకుండా ఎంజాయ్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. లైఫ్ ని ఎంజాయ్ చేయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ కి రవితేజ గారితో పాటు ఇక్కడికి వస్తాను. అందరికీ థాంక్ యూ.

హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ..  హాయ్ వరంగల్. మీ ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఎనర్జీ వామ్మో వాయ్యో సాంగ్లో ఉంది. రవితేజ గారు ఫెంటాస్టిక్ డాన్సర్. నేను డింపుల్ చాలా కష్టపడి డాన్స్ చేశాం. థియేటర్లో ఈ పాట మంచి వైబ్ ఉంటుంది. గ్రేట్ ఎనర్జీ మాస్ నెంబర్. సినిమా 13న రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా సూపర్ హిట్ అయింది. అది నాకు లక్కీ. మరోసారి సంక్రాంతికి వస్తున్నాను. అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. ఈ సాంగ్  మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు చాలా స్పెషల్ సాంగ్. మీ అందరికీ కూడా నచ్చడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూడాలి. రవితేజ గారితో పని చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. వామ్మో మంచి మాస్ నెంబర్. చాలా రోజుల తర్వాత చేశాను. తప్పకుండా సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్యు.

నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం:
కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
PRO: వంశీ-శేఖర్

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

4 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 day ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago