‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది: హీరోయిన్‌ లయ

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా హీరోయిన్‌ లయ ఈ చిత్ర విశేషాల గురించి విలేకరులతో మాట్లాడారు.

దాదాపు 20 ఏళ్ల గ్యాప్‌ తరువాత శివాజీ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?

శివాజీ గారు నేను కలిసి నటించి 20 ఏళ్లు అవుతుంది. ఈ చిత్రంలో నటించాలి అనగానే ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను. కానీ ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అనగానే నాకు ఇష్టమైన జోనర్‌లో ఉంది అనిపించింది. నాకు కామెడీ సినిమాలంటే ఇష్టం. అందరికి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. కామెడీ జోనర్‌ అనేది అని ఏజ్‌ల వారికి నచ్చుతుంది. ఈ కామెడీ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఇది డార్క్‌ కామెడీ జోనర్‌. కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. కథ వినగానే యూనిక్‌ ఫీలింగ్‌ వచ్చింది.

మీ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుంది?
ఈ చిత్రంలో నేనుఉత్తర పాత్రలో నటించాను. ఇప్పటి వరకు నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు. నాకు కూడా ఈ పాత్ర వినగానే ఎంతో ఎక్జ్సయిటింగ్‌గా అనిపించింది. మంగపతిలాంటి పవర్‌ఫుల్‌ పాత్ర చేసిన హీరోను డామినేట్‌ చేసే పాత్ర నాది. కానీ శివాజీ గారు ఎంతో ఎంకరైజ్‌ చేశారు. నా రోల్ బాగా నచ్చింది. నేను, శివాజీ కలిసి నటించిన సన్నివేశాలు ఎంతో హిలేరియస్‌ గా ఉంటాయి.

ఈ సినిమాను మొదట్లో ఓటీటీకి అనుకున్నారు? ఇప్పుడుథియేటర్‌లో విడుదల కాబోతుంది?
ప్రారంభంలో థియేటర్‌కే అనుకున్నాం. కానీ మధ్యలో అనుకోకుండా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అన్నారు. నన్ను నేను పెద్ద స్క్రీన్‌లో చూసుకోవడం అలవాటు కాబట్టి ఓటీటీ అనగానే కొంచెం డిజప్పాయింట్‌ అయ్యాను. అయితే మళ్లీ చాలా మంది ప్రముఖులు సినిమా చూసి ఇది థియేటర్‌లో విడుదల చేసే సినిమా అని అనడంతో మళ్లీ థియేటర్‌లోకి రాబోతుంది. . మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది. నా సినిమా అంటే వెండితెరపై చూడాలనేది తన కోరిక. ఇప్పుడు థియేటర్‌ అనగానే ఎంతో ఆనందంగా ఉంది.

సినిమా మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
ట్రైలర్‌ బాగుంది. అందరికి నచ్చింది అంటున్నారు. సినిమా కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అందరిని సంతృప్తిపరిచే సినిమా ఇది. అందరూ ఓ మంచి సినిమా శాటిస్‌ఫాక్షన్‌తో వెళ్లిపోతారు.

శివాజీలో ఎలాంటి మార్పు ఏమైనా?
సినిమా అంటే ఆయనకు పాషన్‌. ప్రతిసారి సినిమాను జనాలకు ఎలా రీచ్‌ చేయాలి అనే విషయంపై తపన పడుతుంటాడు. సినిమాను అన్ని రకాలుగా ఆయన ప్రేమిస్తుంటాడు. సినిమాపై ప్రేమ అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెరిగింది.

దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ గురించి?
స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో. అంత క్లారిటీగా తెరకెక్కించాడు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. సినిమాను ఎంతో హిలేరియస్‌గా తెరకెక్కించాడు. తనకు ఎలా కావాలో అలాంటి నటనను నటీ నటుల నుండి తీసుకున్నాడు. కాంప్రమైజ్‌ అవ్వని దర్శకుడు. అతనికి ఏం కావాలో అది బాగా తెలుసు. మంచి ప్రతిభ గల దర్శకుడు.

ఈసినిమాలో మీ పాత్ర ప్రత్యేకత ఏమైనా ఉందా?
లయ అంటే ఎడిపించడం. ఏడవటం.. అనే గుర్తింపు ఉంది. కానీ ఈ సినిమాలో నేనే ఏడిపిస్తాను. ఎంతో ఎంజాయ్‌ చేసిన పాత్ర ఇది. స్వార్థంగా, తన భర్త, ఫ్యామిలీ గురించి ఆలోచించే స్వార్థపరులు పాత్ర. నా భర్త బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఉన్న పాత్ర ఇది.

మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
లీడ్‌రోల్‌ పర్మినిట్‌ కాదు. లీడ్‌ రోల్స్‌ వస్తే చేస్తాను. కానీ కథ, నా పాత్ర నచ్చితే చిన్నపాత్రలైనా చేస్తానుఅమ్మాయిలకు పాత్రలకు పరిధి తక్కువ. వచ్చే పాత్రల్లో బెస్ట్‌ పాత్రలను చేస్తాను. సాఫ్ట్‌ రోల్స్‌ఆల్రెడీ చేశాను. కాబట్టి స్ట్రాంగ్‌ క్యారెకర్స్‌ చేయాలని ఉంది. నేను బేసికల్‌గా చూడ్డానికి స్టాప్ట్‌గా ఉన్నా నేను ఏదైనా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్‌గా చెబుతాను. వదలలో నాలో మరో కోణాన్ని చూస్తారు.
మీ తదుపరి సినిమాలు?
వదల అనే సినిమాలో జగపతిబాబు భార్యగా చేస్తున్నాను. శ్రీకాంత్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నాగేశ్వర రెడ్డి దర్వకుడు. యమలీల తరహాలో సోషియో ఫాంటసీ సినిమా. వదల అనేది సైకలాజికల్‌ థ్రిల్లర్‌. డిఫరెంట్‌ జోనర్‌లో ప్రయత్నిస్తున్నాను.

TFJA

Recent Posts

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

1 week ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago

సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…

2 weeks ago

‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్*

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…

2 weeks ago