సినిమా పేరే ‘రేపు ఉదయం 10 గంటలకు’… :ఫస్ట్ లుక్ విడుదల

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు నుంచి వస్తున్న తాజా సస్పెన్స్‌ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలవుతోన్న చిత్రమిది. మార్చి 3, మంగళవారం ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

‘రేపు ఉదయం పది గంటలకు’ సినిమాలో అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన తారాగణం. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… గడియారాన్ని హైలైట్ చేశారు. టైటిల్ వెనుక ఒక క్లాక్, నటీనటులు అందరి వెనుక మరొక క్లాక్ ఉన్నాయి. టైటిల్ వెనుక గడియారంలో పది గంటలు చూపిస్తే… ఆర్టిస్టుల వెనుక గడియారంలో రెండు గంటల సమయాన్ని చూపించారు. వీటి వెనుక కథ తెలియాలంటే టీజర్, ట్రైలర్ విడుదల వరకు వెయిట్ చేయాలి. 

చెందు ముద్దు దర్శకత్వం వహించిన ‘రేపు ఉదయం పది గంటలకు’ సినిమాను రామ్ వీరపనేని నిర్మిస్తున్నారు. త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. త్వరలో విడుదల తేదీని వెల్లడించనున్నారు.

అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ తదితరులు నటించిన ‘రేపు ఉదయం పది గంటలకు’ చిత్రానికి సమర్పకులు: మాంగో మాస్ మీడియా, సినిమాటోగ్రాఫర్: సునీల్ కుమార్ నామా, సంగీత దర్శకుడు: ప్రిన్స్ హెన్రీ, ఎడిటర్: డి. వెంకట ప్రభు, పీఆర్వో: పులగం చిన్నారాయణ, నిర్మాత: రామ్ వీరపనేని, దర్శకుడు: చెందు ముద్దు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago