‘భరతనాట్యం’ అందరూ ఎంజాయ్ చేసే మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్: హీరో సూర్య తేజ ఏలే

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

హీరో కావాలనే స్పూర్తి ఎప్పుడు.. ఎలా మొదలైయింది?
-నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తివుండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం,  నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో వున్న సమయంలో హితేష్ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. ఈ సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తే బావుంటుంది కోరాను. కథ నచ్చి అంగీకరించారు. కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది. అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు రావడంతో సినిమా స్కేల్ మరింత గా పెరిగింది.  

దర్శకుడిగా కెవిఆర్ మహేంద్ర గారికే ఈ కథ చెప్పడానికి కారణం?
-కెవిఆర్ మహేంద్ర గారితో పరిచయం వుంది. నేను ఆయనకు ఒక డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ఇచ్చాను. అది ఆయనకు నచ్చింది. అప్పటికే ఆయన క్రైమ్ జోనర్ లో ఓ కథ అనుకుంటున్నారు. ఈ కథ ఆయనకు నచ్చుతుందనే నమ్మకంతో చెప్పాను. నా నమ్మకం నిజమైయింది. ఆయనకి నచ్చింది. కెవిఆర్ మహేంద్ర గారు చాలా క్లోజ్ గా వుంటారు. చాలా కామ్ గా వుంటారు. చాలా ఫ్రీడం ఇస్తారు. ఐడియాలని చాలా స్వేఛ్చగా షేర్ చేసుకుంటారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.

‘భరతనాట్యం’ ఆలోచన ఎప్పుడు జనరేట్ అయ్యింది ? ఇది ఫిక్షనల్ నా ?
-‘భరతనాట్యం’ ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా వుంటుంది. ఒక మనిషి షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్ గా ఫీలైన స్ట్రగుల్స్ ని కామికల్ గా చేసి రాసింది. కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్.

‘భరతనాట్యం’ పేరు పెట్టడానికి కారణం ?
-ఈ కథకు ‘భరతనాట్యం’ పర్ఫెక్ట్ టైటిల్. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది.

నటనలో శిక్షణ తీసుకున్నారా?
-వినయ్ వర్మ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. ఏడాది పాటు అన్నపూర్ణలో ఫిల్మ్ కోర్స్ చేశాను.  

మీ నేపధ్యం గురించి ?
-మా నాన్న గారు (ధని ఏలే) సినీ పరిశ్రమలో పాతికేళ్ళుగా పబ్లిసిటీ డిజైనర్ గా పని చేస్తున్నారు. నేను పెయిటింగ్ లో ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేశాను. సినిమా టైటిల్స్ రాస్తుంటాను. డిజైనింగ్, ఎడిటింగ్ లో అనుభవం వుంది. కోవిడ్ తర్వాత రైటింగ్ లోకి వచ్చాను.

ఇందులో హీరోయిన్ కి ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ?
-ఇది లవ్ స్టొరీ కాదు. అన్ని పాత్రలు సమానంగా వుంటాయి. హీరోయిన్ పాత్ర మాత్రం కథలో కీలక పాత్ర పోషిస్తుంది.

మీరు కాకపొతే ఈ సినిమాలో హీరోగా ఎవరు బావుంటారు ?
-శ్రీవిష్ణు గారు, సందీప్ కిషన్ గారైతే బావుంటారు.

క్రైమ్ కామెడీల్లో ఈమధ్య అడల్ట్ కంటెంట్ వస్తుంది. ఈ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?
– ఇది ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

నిర్మాతల గురించి ?
-హితేష్ గారు ముందు నన్ను మనిషిగా నమ్మారు. కథ విని సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. హితేష్, పాయల్ గారు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఎక్కడా రాజీపడకుండా మంచి ప్యాడింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. ఒక చిన్న సినిమాకి ఈ స్థాయిలో పబ్లిసిటీ జరుగుతుందంటే అది నిర్మాత ప్రోత్సాహంతోనే సాధ్యపడుతుంది.

కథ రాయడం వేరు.. కథని లిరిక్ రైటర్స్ కి చెప్పడం వేరు..ఈ ప్రాసస్ గురించి చెప్పండి?
-కాసర్ల శ్యామ్ గారు, అనంత శ్రీరామ్ గారు, భాస్కర భట్ల గారు అద్భుతమైన పాటలు రాశారు. అనంత శ్రీరామ్ గారు చాలా ఫన్ పర్శన్. కథ వింటూ మాతో ట్రావెల్ అయ్యారు. భాస్కర భట్ల గారు చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. ఈ ముగ్గురితో బ్యూటీఫుల్ జర్నీ. పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఏం మనిపించింది ?
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. వివేక్ సాగర్ గారు ట్రెండీ ఆర్ఆర్ ఇచ్చారు. ఈ స్కేల్ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తారు.  

మీ విషయంలో మీ నాన్నగారు ఆనందంగా వున్నారా ?
-నాన్నగారు చాలా ఆనందంగా వున్నారు. ఆయన కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంది.

మీకు ఇష్టమైన రచయిత ఎవరు ?
-నాకు పర్శనల్ గా కృష్ణ వంశీగారు, త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం. అలాగే చాలా మంది నుంచి స్ఫూర్తి పొందాను.

భవిష్యత్ లో రచయితగా కొనసాగుతారా నటుడిగానా ?
-సినిమాల్లో ఉందామని అనుకుంటున్నాను. అది ఎలా అయినా పర్లేదు. రచయితగా కొన్ని కథలు వున్నాయి. ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది. చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ నా తదుపరి సినిమాకి హెల్ప్ అవుతాయి.

ఆల్ ది బెస్ట్
థాంక్ యూ

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago