నక్కిన నేరేటివ్స్‌ ప్రొడక్షన్ నెం.2 గ్రాండ్ గా లాంచ్

స్టార్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్స్ తీయడంలో దిట్ట, తన గత చిత్రం ‘ధమాకా’తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన ఆయన తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్‌లో ప్రొడక్షన్ నెం 2ను అనౌన్స్ చేశారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా నటిస్తుండగా, వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత.

బ్లాక్‌బస్టర్ సినిమా చూపిస్తా మావ తర్వాత త్రినాధరావు నక్కిన మరో అద్భుతమైన కథను రాశారు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా కూడా తన సత్తాను నిరూపించుకోకున్నారు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా లాంచింగ్ వేడుకను జరుపుకుంది. త్రినాథరావు,నాయుడు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం షాట్ కు సందీప్ కిషన్ క్లాప్‌ కొట్టగా, శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. సుమంత్ తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.

సూపర్ హిట్ ఫ్రాంచైజీ దృశ్యం చిత్రంలో వెంకటేష్ కుమార్తెగా కనిపించిన ఎస్తేర్ అనిల్,  విక్రమ్ సహిదేవ్ లగడపాటి సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉండబోతున్న ఈ చిత్రానికి ఈగిల్ ఫేమ్ దావ్‌జాంద్ సంగీతం అందిస్తుండగా, మాయ వి. సినిమాటోగ్రఫర్. ప్రవీణ్ పూడి ఎడిటర్, రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైనర్. నరేష్ తుల, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ రాయగా, త్రినాధ రావు నక్కిన, నరేష్ తుల, ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. ఈ చిత్రం నక్కిన నేరేటివ్స్‌ ప్రొడక్షన్ నెం.2. దీనికి టైటిల్ ఖరారు చేశాం. త్వరలోనే ప్రకటిస్తాం. నేను చాలా స్ట్రగుల్ అయి ఈ స్థాయికి వచ్చాను. నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అవుతుంటారు. వాలందరికీ నా శక్తికి తగ్గ ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దీనికి నా స్నేహితులు, మిత్రులు సపోర్ట్ తో నక్కిన నేరేటివ్స్‌ నిర్మాణ సంస్థని స్థాపించాను. సినిమా చూపిస్తా మామ వరకూ నేనే కథలు రాసేవాడిని. తర్వాత రాయలేదు. నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా మా ప్రసన్న రాశారు. ఐతే ఈ సినిమా కోసం మళ్ళీ కథ రాశాను. ఇది కల్ట్ లవ్ స్టొరీ. టౌన్ లో జరిగే అందమైన ప్రేమకథ. ఇందులో విలన్ పాత్ర కూడా చాలా కీలకమైనది.  కథ అద్భుతంగా వచ్చింది. నాతో పాటు నరేష్ , ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లేలో, నరేష్ , రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ లో పని చేశారు. దర్శకుడు వంశీ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో విక్రమ్ పాత్ర అదిరిపోతుంది. విక్రమ్ కి జోడిగా ఎస్తర్ చేస్తున్నారు. తనలో చాలా ప్రతిభ వుంది. పొన్నప్ప మరో కీలకమైన పాత్రలో కనిపిస్తారు. దేవ్ జాంద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా వుంటుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులతో సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నాం. దర్శకుడిగా ప్రేక్షకులు నన్ను గొప్పగా ఆదరించారు. నిర్మాతగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాను. దీనికి కూడా పెద్దపీట వెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఇందులో పని చేస్తున్న అందరికీ మంచి పేరు రావాలి” అని కోరారు.

దర్శకుడు వంశీ కృష్ణ మల్ల మాట్లాడుతూ…త్రినాధరావు నక్కిన గారికి ధన్యవాదాలు. ఆయన చాలా ప్రేమించి రాసుకున్న కథని నా చేతిలో పెట్టారు. వందశాతం కష్టపడి ఆయన అనుకున్నదాని కంటే బెటర్ అవుట్ పుట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఎక్కడా రాజీపడకుండా పెద్ద టెక్నిషియన్స్ తో సినిమాని నిర్మిస్తున్నందుకు త్రినాధరావు గారికి ధన్యవాదాలు. మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచి మొదలుపెడుతున్నాం. అనకాపల్లి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తాం. త్రినాధరావు గారు లాంటి పెద్ద దర్శకులు నన్ను నమ్మి సినిమా ఇచ్చారు. ఆయనకి రుణపడి వుంటాను. ఇది మామూలు సినిమా కాదు. ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది.  విక్రమ్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు.  ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ హీరో అవుతాడు. ఎస్తేర్ పాత్ర కూడా చాలా అద్భుతంగా వుంటుంది. తారక్ పొన్నప్ప పాత్ర కూడా కీలకంగా వుంటుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఎవరూ వూహించలేని జోనర్ ఇది. దావ్‌జాంద్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు” అన్నారు.

హీరో విక్రమ్ సహిదేవ్ లగడపాటి మాట్లాడుతూ.. త్రినాధరావు నక్కిన గారి ప్రొడక్షన్ లో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు . మీ అందరి ఆశీస్సులు కావాలి.’ అని కోరారు

హీరోయిన్ ఎస్తేర్ అనిల్ మాట్లాడుతూ.. దృశ్యం తర్వాత మరోసారి మీ ముందుకు రావడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ తెలిపారు.

సంగీత దర్శకుడు దావ్‌జాంద్ మాట్లాడుతూ… త్రినాథ్ గారితో ఇది రెండో ప్రాజెక్ట్. కథ చాలా బావుంది. ఐదు అద్భుతమైన పాటలు కుదిరాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.  

తారాగణం: విక్రమ్ సహిదేవ్ లగడపాటి, ఎస్తేర్ అనిల్,  తారక్ పొన్నప్ప

సాంకేతిక సిబ్బంది:
కథ & నిర్మాత – త్రినాధరావు నక్కిన
దర్శకత్వం – వంశీ కృష్ణ మల్ల
బ్యానర్ – నక్కిన నేరేటివ్స్‌
డీవోపీ – మాయ వి
సహ నిర్మాత – N.V.S.S. సురేష్
సంగీతం – దావ్‌జాంద్
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ – రఘు కులకర్ణి
స్క్రీన్ ప్లే – త్రినాధ రావు నక్కిన, నరేష్ తుల, ఉదయ్ భాగవతుల
డైలాగ్స్ – నరేష్ తుల, రాజేంద్ర ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సీతారామరాజు మల్లెల
పీఆర్వో – వంశీ – శేఖర్
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ & భాను
ప్రొడక్షన్ కంట్రోలర్ – దాసరి జయవీర్ నగేష్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago