చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "బాక్సు బద్దలౌద్ది". వివేకానంద విక్రాంత్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,…
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.…
'శాకిని డాకిని' యూనిక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్.. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: 'శాకిని డాకిని' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో అడవి శేష్, దర్శకులు నందిని రెడ్డి, అనుదీప్, విమల్ కృష్ణ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సీనియర్ కథానాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నివాళిగా చిత్ర బృందం మౌనం పాటించి అంజలి ఘటించింది. అడవి శేష్ మాట్లాడుతూ.. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ వండర్ ఫుల్ యాక్టర్స్. రెజీనాతో 'ఎవరు'లో కలసి పని చేశా. మొన్ననే రెజీనా రాకెట్ బాయ్స్ చూశాను. చాలా నచ్చింది. నివేదా చేసిన నిన్ను కోరి, బ్రోచేవారెవరురా నాకు చాలా ఇష్టం. తను ఏ పాత్ర చేసిన అద్భుతంగా వుంటుంది. ఈ ఈవెంట్ కి రావడానికి కారణం సునీత గారు. మా కోరిక మేరకు సునీత గారు మేజర్ లో హీరోయిన్ మదర్ గా చేశారు. అయితే లెంత్ కారణంగా సినిమాలో సీన్లు వుంచడం కుదరలేదు. ఈ ఈవెంట్ వేదికగా సునీత గారికి క్షమాపణలు చెబుతున్నా. 'మిడ్‌నైట్ రన్నర్స్' ఇద్దరు అబ్బాయిలు చేసిన సినిమా. ఇందులో ఇద్దరు అమ్మాయిలు చేయడం చాలా క్యూరియాసిటీని పెంచుతోంది. సెప్టెంబర్ 16న 'శాకిని డాకిని' థియేటర్లోకి వస్తుంది. నేను థియేటర్ లో ఉంటా. థియేటర్ లో కలుద్దాం'' అన్నారు. నందిని రెడ్డి మాట్లాడుతూ.. హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ కామెడీ గా 'శాకిని డాకిని' రావడం చాలా ఆనందంగా వుంది. ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తే అదిరిపోతుంది. నాకు థియేటర్ కి వెళ్లి చూడాలని వుంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కెమిస్ట్రీ చాలా యూనిక్ గా వుంది. 'శాకిని డాకిని' ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ అవుతుంది. మన తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ వుంటే ఖచ్చితంగా చూస్తారు. ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. నాకు ఓ బేబీ సినిమా ఇచ్చిన సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కి థాంక్స్. ఓ బేబీ కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. రెజీనా చాలా మంచి మనసున్న నటి. రెజీనా, నివేదా ఈ సినిమాని చాలా ప్యాషన్ తో చేశారు. సెప్టెంబర్ 16న సినిమాని తప్పకుండా థియేటర్లలో చూడండి'' అని కోరారు. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. శాకిని డాకిని తో చాలా ట్రావెల్ చేశాం. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ కి కృతజ్ఞతలు. ఇలాంటి చిత్రాలని ఇలాంటి నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బావుంటుంది. దర్శకుడు సుధీర్ వర్మ సినిమాని అద్భుతంగా తీశారు. రిచర్డ్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. అక్షయ్ చాలా మంచి డైలాగ్స్ రాశారు. సంయుక్త కి బిగ్ థాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కి థాంక్స్. యాక్షన్ మాస్టర్ వెంకట్ గారికి స్పెషల్ థాంక్స్. నాకు ఎప్పటి నుండో యాక్షన్ సినిమా చేయాలని వుంది. ఈ సినిమాతో కుదిరింది. నరేష్ చాలా మంచి పాటలు ఇచ్చారు. సునీత మేడంకి హ్యాపీ బర్త్ డే. ఆమెతో కలసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నుండి చాలా నేర్చుకున్నాను. నివేదాతో కలసి నటించడం చాలా ఆనందంగా వుంది. ఒక నటిగా నివేదా అంటే నాకు చాలా ఇష్టం. సెప్టెంబర్ 16న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా థియేటర్ కి వెళ్లి చూడండి. ఈ సినిమా మాకు ఒక మైల్ స్టోన్ గా కాబోతుందనే నమ్మకం వుంది. నివేదా థామస్ మాట్లాడుతూ.. 'శాకిని డాకిని' తో చాలా నేర్చుకున్నాను. ఇందులో పని చేసిన ప్రతిఒక్కరూ నన్ను ముందుకు నడిపారు. నరేష్ బ్రిలియంట్ నేపధ్య సంగీతం అందించారు. ఇద్దరు హీరోయిన్స్ తో 'శాకిని డాకిని' చేయాలనే ఆలోచన సంయుక్తది. సుధీర్ వర్మ లాంటి ప్రతిభగల దర్శకుడిని ఇచ్చి ఇంత గొప్పగా సినిమా విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ , సురేష్ బాబు, సునీత మేడం కి కృతజ్ఞతలు. సునీత మేడం నుండి చాలా నేర్చుకున్నాను. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులని దాటుకొని చాలా విజయవంతంగా సినిమాని నిర్మించారు. రెజీనాతో కలసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. నందిని రెడ్డి, అడివి శేష్, అనుదీప్ ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. కొత్త కంటెంట్ ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుటారు. ఈ సినిమాని కూడా ఆదరిస్తారనే నమ్మకం వుంది'' అన్నారు. సునీత తాటి మాట్లాడుతూ.. ఇద్దరు హీరోలతో ఈ సినిమా చేయాలని మొదలుపెట్టాం. ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేస్తే ఎలా వుంటుందని సంయుక్త అన్నారు. ఈ విజన్ ని దర్శకుడు సుధీర్ వర్మ నమ్మారు. ఈ సినిమా టైటిల్ ఇచ్చింది కూడా సంయుక్తనే. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులని దాటి సినిమాని చాలా విజయవంతంగా నిర్మించాం. 'శాకిని డాకిని' యూనిక్ ఫిల్మ్ .రెజీనా, నివేదా లేకుండా ఈ సినిమా వుండేది కాదు. యాక్షన్ కోసం చాలా కష్టపడ్డారు. నివేదాలో మంచి డైరెక్టర్ కూడా వున్నారు. ఆమె ఆ సవాల్ ని త్వరలోనే స్వీకరిస్తుందని భావిస్తున్నాను. రెజీనా అద్భుతమైన నటి. అన్ని భాషల్లో చాలా మంచి చిత్రాలు చేస్తోంది. ఈ వేడుకకి అడవి శేష్ రావడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో మాకు సహకరించిన మా బ్రదర్, డాక్టర్ శరత్ అద్దంకి కి కృతజ్ఞతలు. సతీష్, పృద్వీ గారు, అనుదీప్ కి థాంక్స్. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్, పవన్, పాటలు రాసిన రాకేందు మౌళి, డైలాగ్ రైటర్ అక్షయ్, నేపధ్య సంగీతం అందించిన నరేష్, నిహారిక, ఎడిటర్ విప్లవ్ కి కృతజ్ఞతలు'' తెలిపారు. అనుదీప్ మాట్లాడుతూ.. నిర్మాతలు సురేష్ బాబు, సునీత తాటి, హీరోయిన్లు రెజీనా, నివేదాలకు ఈ సినిమా పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 16న ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు. విమల్ కృష్ణ మాట్లాడుతూ.. 'మిడ్‌నైట్ రన్నర్స్' చూశాను. ఇది తెలుగులో ఎలా వుంటుందో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ చూసిననప్పుడు చాలా క్యురియాసిటీ పెంచింది. రెజీనా, నివేదా అద్భుతంగా యాక్ట్ చేశారు. సురేష్ బాబు గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు. సతీష్ మాట్లాడుతూ .. ఈ సినిమా కథ గురించి నాకు తెలుసు. అద్భుతమైన కథ. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేశారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా తప్పకుండా చూడండి'' అన్నారు రాకేందుమౌళి మాట్లాడుతూ.. ఇందులో రెండు పాటలు రాశాను. రెండు పాటలు చాలా వైవిధ్యంగా వుంటాయి. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేష్ బాబు, సునీత తాటి గారికి థాంక్స్. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ఇద్దరూ అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 16న సినిమా వస్తోంది. తప్పకుండా చూడండి'' అన్నారు…
బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ.…
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ “లైక్ షేర్ & సబ్ స్క్రైబ్” నుండి జాక్ డేనియల్స్ గా నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదల వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ కొన్ని సూపర్‌హిట్ లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ తో 'లైక్ షేర్ & సబ్ స్క్రైబ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్' ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్ టైనర్ లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ 'శ్యామ్ సింగరాయ్' ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటివలే విదుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదలైయింది. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జాక్ డేనియల్స్ గా సుదర్శన్ ఫస్ట్ లుక్ హిలేరియస్ గా వుంది. సినిమా నుండి రివిల్ చేస్తున్న మెటీరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్
వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి' రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.…
Versatile star Naga Shaurya’s different rom-com Krishna Vrinda Vihari will arrive in cinemas in less than two weeks. Promotions are…
విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం…
ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్…
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. శర్వానంద్, అమల అక్కినేని, నిర్మాత ఎస్ఆర్ ప్రభు, వెన్నెల కిషోర్, శ్రీకార్తిక్, సుజీత్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. దీని కోసమే కదా సినిమాల్లోకి వచ్చామనిపించింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనే అటుంచితే థియేటర్ లో చప్పట్లు వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమని ఇచ్చారు. సినిమా చూసిన అందరూ హత్తుకుంటున్నారు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి. నా చుట్టూ పక్కల వున్న వాళ్ళంతా నేను సక్సెస్ కొట్టాలని కోరుకున్నారు. ఇదే నా మొదటి సక్సెస్. వంశీ శేఖర్ చాలా ఆప్యాయంగా హత్తుకున్నారు. నన్ను నడిపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన అందరూ చాలా డిఫరెంట్ గా అనిపించాం. దీనికి కారణం మా దర్శకుడు శ్రీకార్తిక్. ఇంత గొప్ప కథని రాసిన శ్రీకార్తిక్ కు కృతజ్ఞతలు. అతని మొదటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా వుంది. అమల గారితో పని చేయడం గౌరవంగా వుంది. అమల గారు కనిపించగానే థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమల గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుజీత్ సినిమాని అద్భుతంగా చూపించారు. నిర్మాత ప్రభుగారు ధైర్యం గల నిర్మాత. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం వుండాలి. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. వర్డ్ అఫ్ మౌత్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రేక్షకులు. ప్రతి షోకి ప్రేక్షకులు డబల్ అవుతున్నారు. ఈ రోజు షోలు మొత్తం ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు, మీడియా మిత్రులు సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సక్సెస్ వారిదే. ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు. ఒకే ఒక జీవితం. ఎంజాయ్ యువర్ లైఫ్'' అన్నారు అమల అక్కినేని మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం ప్రేక్షకులకు నచ్చింది. అందరూ సినిమాని ప్రశంసిస్తున్నారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు. శర్వాతో వర్క్ చేయడం ఆనందంగా వుంది. రీతూ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి అందరూ చక్కగా చేశారు. శ్రీకార్తిక్ సినిమాకి అద్భుతంగా దర్సకత్వం వహించారు. నిర్మాత ప్రభు గారు చాలా సాహసం గల నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. సుజిత్ శ్రీజిత్ జేక్స్ బిజోయ్ ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. యువత ధైర్యంగా జీవితాన్ని ఎదురుకొని విజయం సాధించే మార్గం చూపే సినిమా ఇది. ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఎంతో గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు''అని తెలిపారు. నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ.. సినిమాకి అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం పని చేసిన మా టీంకి కృతజ్ఞతలు. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి మా టీం తరపున కృతజ్ఞతలు' అని తెలిపారు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..నేను చాలా స్ట్రాంగ్ అని ఫీలౌతా. కానీ ఇందులో అమల గారి ఎంట్రీ తర్వాత కన్నీళ్లు ఆగలేదు. ఈ సినిమాలో మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు కార్తిక్ కి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని ఇప్పించిన శర్వానంద్ కి థాంక్స్. ప్రియదర్శి కూడా చాలా సపోర్ట్ చేశారు. అమల గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం గొప్ప విజయంగా భావిస్తున్నా. సినిమాని చూసిన ప్రేక్షకులు చాలా తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ గారి నటనని ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. శర్వానంద్- అమల గారు తల్లీ కొడుకులు గా ప్రేక్షకుల మనసుని హత్తుకున్నారు. వెన్నెల కిషోర్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. చిరకాలం గుర్తిండిపోయే సినిమా ఇది. మీ ఫ్యామిలీ తో కలసి సినిమాని థియేటర్ లో చూసి ఆనందించండి'' అని కోరారు. సుజీత్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది. శర్వానంద్, అమల గారి తో పని చేయడం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని తీశారు. పచాలా నిజాయితీగా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు అంతే గొప్పగా ఆదరించడం ఆనందాన్ని ఇస్తుంది'' అన్నారు