Categories: న్యూస్

సకల గుణాభి రామ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల

బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16 న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్ బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

నటుడు సోహైల్ మాట్లాడుతూ “మా బిగ్ బాస్ సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల అవుతుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. మేము బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయ్యాము కానీ మా అందరి గోల్ మాత్రం సినిమాల్లో నటించడమే. మేము అందరం చాలా కష్టపడి మా కెరీర్ ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు అందరూ ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి” అని కోరుకున్నారు. 

డైరెక్టర్ శ్రీనివాస్ వెలిగొండ మాట్లాడుతూ “చిన్న చిత్రాలు రిలీజ్ కి చాలా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సకల గుణాభి రామ చిత్రాన్ని నిర్మించారు అలాగే అది నారాయణ గారు సెప్టెంబర్ 16న మంచి మంచి థియేటర్ లో విడుదల చేస్తున్నారు. లాక్ డౌన్ టైం లో చిన్న సినిమా గా ప్రారంభం అయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కొత్త టెక్నిషన్స్ చాలా కష్టపడి పని చేసాం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది” అని కోరుకున్నారు. 

యాంకర్ రవి మాట్లాడుతూ “మేము బిగ్ బాస్ టీం కాదు, మేము సినిమా వాళ్ళం, ఏదో ఒక శుక్రవారం మాది కావాలి అని కోరుకుంటాం, శుక్రవారం సెప్టెంబర్ 16 న మా సన్నీది. సకల గుణాభి రామ చిత్రం నేను చూసాను, చాలా బాగుంటుంది, ఈ చిత్రం లో మ్యూజిక్ చాలా గొప్పగా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. సన్నీ కి ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు. 

బిగ్ బాస్ జెస్సి మాట్లాడుతూ “మా అమ్మ కి సన్నీ అంటే చాలా ఇష్టం. సన్నీ చాలా కష్టపడి ఈ సినిమా చేసాడు. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ అల్ ది బెస్ట్” అని తెలిపారు. 

నటుడు మానస్ మాట్లాడుతూ “ఈ చిత్రం నేను చూసాను, చాలా బాగా వచ్చింది చిత్రం. సెప్టెంబర్ 16న విడుదల అవుతుంది అందరికి నచ్చుతుంది. ఇది కంటెంట్ ఉన్న చిత్రం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి” అని తెలిపారు. 

హీరోయిన్ ఆషిమా మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెలిగొండ గారికి నిర్మాత గారికి నా ధన్యవాదాలు. సన్నీ తో నటించడం చాలా బాగుంది. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. అందరికి నచ్చుతుంది” అని కోరుకున్నారు. 

డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ మాట్లాడుతూ “ఈ చిత్రం 100 థియేటర్స్ లో సెప్టెంబర్ 16 న విడుదల అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది. డైరెక్టర్ శ్రీనివాస్ వెలిగొండ మంచి చిత్రాలకి రైటర్ గా పని చేశారు. మంచి టాలెంట్ ఉంది తనకి. మా నిర్మాత మంచి ప్యాషనేట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సన్నీ నటన, హీరోయిన్ అసిమా నటన ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటాయి” అని తెలిపారు. 

హీరో సన్నీ మాట్లాడుతూ “నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన సోహైల్ కి, జెస్సి కి, మానస్ కి, రవి కి, హమీద అందరికీ నా కృతజ్ఞతలు. మాకు బిగ్ బాస్ ప్లాటుఫారం ఉన్న సినిమా లో నటించాలి అనే కోరిక మా అందరిలో ఉంది. నేను బిగ్ బాస్ లో రాక ముందే నాకు హీరో గా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. నాకు హీరో గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు. సోహైల్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. తనకు అద్భుతమైన టాలెంట్ ఉంది. తన చిత్రాలు మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. మానస్ నా ప్రాణ మిత్రుడు తన చిత్రాలు కూడా హిట్ కావాలి. మా చిత్రాన్ని 100 థియేటర్స్ లో విడుదల చేస్తున్న అది నారాయణ గారికి నా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసాము, ప్రేక్షకులు అందరూ మా సినిమా ని చూసి హిట్ చేస్తారు” అని కోరుకున్నారు. 

చిత్రం పేరు : సకల గుణాభి రామ 

నటి నటులు : వి జె సన్నీ, అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్ర,  తదితరులు 

డైరెక్టర్ : వెలిగొండ శ్రీనివాస్ 

నిర్మాత : సంజీవ్ రెడ్డి 

మ్యూజిక్ డైరెక్టర్ : అనుదీప్ 

కెమెరా మాన్ : నళిని కాంత్ 

ఎడిటర్ : వెంకట్ 

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago