సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ “లైక్ షేర్ & సబ్ స్క్రైబ్” నుండి జాక్ డేనియల్స్ గా నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదల
వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ కొన్ని సూపర్‌హిట్ లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ తో ‘లైక్ షేర్ & సబ్ స్క్రైబ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్’ ఏక్ మినీ కథ’ కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.
యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్ టైనర్ లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇటివలే విదుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదలైయింది. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జాక్ డేనియల్స్ గా సుదర్శన్ ఫస్ట్ లుక్ హిలేరియస్ గా వుంది. సినిమా నుండి రివిల్ చేస్తున్న మెటీరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
డీవోపీ: వసంత్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…