చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “బాక్సు బద్దలౌద్ది”. వివేకానంద విక్రాంత్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుధాన్ కుమార, ప్రవీణ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.
నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ క్లాప్ కొట్టగా మరొక ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ వడ్లపట్ల కెమెరా స్విచాన్ చేయగా, ఎస్ కుమార స్వామి మొదటి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం నిర్విరామంగా 35 రోజుల పాటు కొనసాగనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.., కరోనా అనంతరం సినిమా పరిశ్రమలో నెలకొన్న సంఘటనలు ప్రధానాంశంగా తీసుకుని, ఒక ఫిల్మ్ మేకర్ కలను సినిమా రూపంలో చూపించబోతున్నాం. అలాగే మూవీ మొఘల్ రామానాయుడు గారి ఆలోచన విధానం లో ఉన్న ఆర్కే నాయుడు అనే పాత్రలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నటించడం మా టీం కి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా సినిమా ప్రారంభానికి విచ్చేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.., నిజ జీవితంలో నిర్మాతగా ఉన్న నన్ను ఈ సినిమాలో ముఖ్యమైన నిర్మాత పాత్రలో తెరపైకి తీసుకు వస్తున్న సినిమా బృందానికి శుభాభినందనలు తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ, కథనం తో పాటు సినిమా టైటిల్ సైతం నన్నెంతగానో ఆకట్టుకుందని అన్నారు.
సినిమాలో సినిమా తీయడమే కాన్సెప్ట్ ఇప్పటికీ ఎవర్గ్రీన్, మా సినిమా ప్రారంభానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలని సినిమా హీరో వివేకానంద్ విక్రాంత్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుధాన్ కుమార్, పెరుమాళ్ళ ప్రవీణ్, సతీష్, చరణ్, శశి తదితరులు పాల్గొన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…