వెర్సటైల్ హీరో నాగశౌర్య , అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది. ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్య తో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య . దర్శకుడు అనీష్ కృష్ణ అండ్ టీమ్ ఈ సాంగ్‌ని హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. మహతి స్వర సాగర్ క్యాచి నెంబర్ ని స్కోర్ చేయగా, రామ్ మిరియాల ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్. ‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స్ సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్ సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్ - తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ - రామ్ కుమార్ డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్ పీఆర్వో: వంశీ, శేఖర్
ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి…
నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా…
ఈ నెల 16న గ్రాండ్ గా 550 థియేటర్స్ లలో విడుదల అవుతున్న “నేను మీకు బాగా కావాల్సినవాడిని” రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం…
There is no end to entertainment on Zee Telugu, and its amazing line up of clutter-breaking shows lends credence to…
Naane Varuvean is set for its theatrical release this month and the makers are yet to officially announce the release…
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు మరియు విలక్షన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో "నానే వరువేన్" చిత్రాన్ని చేసిన విషయం విదితమే. తాజాగా షూటింగ్…
వినోదాత్మకమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోస్ తో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న 'జీ తెలుగు' ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకువస్తూ వారి మన్ననలు పొందుతున్న…
గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్, శింబు... ముగ్గురితో పని చేయాలనే కల 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'తో నెరవేరింది. శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా…
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకార్తిక్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు. మొదటి సినిమా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. సరైన హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన రెండేళ్ళు... సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక బరువు దిగిన భావన కలుగుతోంది. చాలా ఆనందంగా వుంది. ఈ కథ ఆలోచన రావడానికి కారణం మీ అమ్మగారేనా ? అవును. తను బెడ్ మీద వున్నపుడు నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూపించాలని అనుకున్నా. కానీ తను అప్పటికే అపస్మారక స్థితిలో వున్నారు. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని కూడా తనకి తెలీదు. ఆ విషయంలో రిగ్రేట్ వుండేది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఈ కథకు భీజం వేసింది. ఎమోషన్ ని సైన్స్ లో ఎలా బ్లండ్ చేశారు ? నాకు సైన్స్ చాలా ఇష్టం. ఇందులో సైన్స్ లేకపోతే మెలో డ్రామా అయ్యేది. ఆడియన్స్ కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ కథని సైన్స్ తో ట్రీట్ చేశా. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. మేము అనుకున్న విజయం సాధించింది. భవిష్యత్ లో మరిన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తాయని భావిస్తాను. శర్వానంద్ తో పని చేయడం ఎలా అనిపించింది ? శర్వానంద్ తో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమా నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్. శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. శర్వా లాంటి స్టార్ హీరో ఈ సినిమా చేయడమే పెద్ద సక్సెస్. శర్వాకి ఒక మంచి సినిమా, మంచి విజయం ఒకే ఒక జీవితం అవుతుందనినమ్మా. ఆ నమ్మకం నిజమైయింది. అమల గారిని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ? అమల గారిని తీసుకోవాలనే ఆలోచన నాదే. కథ విన్న తర్వాత అమల గారికి చాలా నచ్చింది. వెంటనే సినిమా చేస్తానని చెప్పారు. మీలో ఒక డ్యాన్సర్, నటుడు, దర్శకుడు, నిర్మాత వున్నారు కదా.. ఈ కోణాలు గురించి చెప్పండి ? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నా. అదికాకపొతే న్యూయార్క్ స్కూల్ లో డ్యాన్స్ లో మాస్టర్స్ చేయాలనీ అనుకున్నా. ఇదే సమయంలో ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. రాధిక, గౌతమి గారు ఆ షోకి న్యాయ నిర్ణేతలు. నా ఎక్స్ ప్రెషన్, యాక్టింగ్ బావుందని మెచ్చుకున్నారు. నాలో ఒక నమ్మకం వచ్చింది. నటుడ్ని కావాలని చాలా తిరిగా. రెండేళ్ళు అవకాశాలు రాలేదు. తర్వాత నేనే రాయాలి నేనే తీయాలి అనే నిర్ణయానికి వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశా. ఒకే ఒక జీవితానికి ఐదేళ్ళు పట్టిందని చెప్పారు కదా.. మరి షూటింగ్ ఎన్ని రోజులు తీసుకున్నారు ? షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాది పట్టింది. షూటింగ్ ని త్వరగానే పూర్తి చేశాం. రెండు భాషల్లో కలిపి 78 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశాం. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనుకోవచ్చా(నవ్వుతూ)…