ఫ్యామిలీ ఎమోషన్ & ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ మూవీ “నేను మీకు బాగా కావాల్సినవాడిని

ఈ నెల 16న గ్రాండ్ గా 550 థియేటర్స్ లలో విడుదల అవుతున్న “నేను మీకు బాగా కావాల్సినవాడిని”

రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా సినిమా  “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు  ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇందులో హీరో కిరణ్ అబ్బ వరం కొత్తగా కనిపించనున్నాడు.ఈ మద్యే చిత్ర ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ఫాదర్ గా దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి గారు నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న గ్రాండ్ గా ఇండియా వైడ్ గా 550 పైచిలుకు థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర హీరో కిరణ్ అబ్బవరం పాత్రికేయ మిత్రులతో  మాట్లాడుతూ..

దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్‌ ను పవన్ అన్న లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌

మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా  ఉంటుంది.
కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్ కు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈసినిమాను చూసిన వారందరూ కచ్చితంగా ఎంజాయ్  చేస్తారు .

హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్ కు చాలా బూస్టప్ ఇస్తుంది.ఇందులో  రెండు సేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను.అయితే ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర  చేయడం ఇదే అవుతుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను
హీరోయిన్ కు కూడా మంచి ప్రాదాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది..

దర్శకుడు  శ్రీధర్ నా కాంబినేషన్ లో సినిమా చేయడానికి  కొంతమంది ప్రయత్నించినప్పటికీ కోడి దివ్య గారి బ్యానర్ లో ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను.ఇందులో నాది బాబా భాస్కర్ ల ట్రాక్ చాలా బాగుంటుంది.

నిర్మాత కోడి దివ్య దీప్తి సహకారం వల్లే  ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది.అయన ఇచ్చిన పాటలు, ఆర్ ఆర్ అద్భుతంగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.

గీతా ఆర్ట్స్ లో “వినరో విష్ణు భాగ్యం”, మైత్రి మూవీ మేకర్స్ లో  “మీటర్ ” ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొన్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40% షూటింగ్ అయ్యింది.ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

9 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

9 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago