Categories: Uncategorized

స్టార్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఆవిష్క‌రించిన ‘కథ వెనుక కథ’  టీజ‌ర్‌


కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న శుక్ర‌వారం ఈ మూవీ టీజ‌ర్‌ను క్రాక్‌, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన  స్టార్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రిలీజ్ చేశారు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని, సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.

75 సెకన్ల కథ వెనుక కథ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఓ యంగ్ డైరెక్ట‌ర్ (విశ్వంత్) మ‌రో పాత్ర‌కు ఓ క్రైమ్ క‌థ‌ను చెప్ప‌టంతో టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది. సిటీ చాలా వ‌ర‌కు మిస్సింగ్ కేసులుగా న‌మోదు అవుతున్న అమ్మాయిల‌ను ఎవ‌రో హ‌త్య చేస్తుంటారు. ఇంత భ‌యంక‌ర‌మైన హ‌త్య‌ల‌ను చేస్తున్న హంత‌కుడెవ‌రో పోలీసుల‌కు అంతు చిక్క‌దు. దీంతో వారు కేసుని స‌త్య (సునీల్‌) అనే సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కి అప్ప‌గిస్తారు. సిటీలో జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు ఓ వ్య‌క్తి కార‌ణం కాద‌ని, ఓ గ్యాంగ్ క‌లిసి ఈ హ‌త్య‌ల‌ను చేస్తుంద‌ని స‌త్య‌కు తెలుసుకుంటాడు. మ‌రి ఈ విష‌యాన్ని స‌త్య ఎలా క‌నుక్కుకున్నాడు.. అత‌ను టీజ‌ర్‌లో చెప్పిన‌ట్లు మిస్ అయిన ఓ పాయింట్ ఏంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే క‌థ వెనుక క‌థ టీజ‌ర్‌ను గ‌మ‌నించాల్సిందే.

టీజ‌ర్‌లో పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ ప్ర‌కారం విశ్వంత్ పాత్ర ప‌జిలింగ్‌గా అంద‌రూ అనుమాన ప‌డేలా క‌నిపిస్తుంది. మ‌రో వైపు ఇదే క్యారెక్ట‌ర్ 2019లో జ‌రిగిన దిశ రేప్, మ‌ర్డ‌ర్ కేసు గురించి చెప్ప‌టం అప్పుడు ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన ఎమోష‌న‌ల్ రియాక్ష‌న్స్‌, దానికి పోలీసులు చూపించిన యాక్ష‌న్ గురించి ప్ర‌స్తావ‌న ఉంటుంది. అస‌లు వ‌రుస హ‌త్య‌ల వెనుకున్న సీరియ‌ల్ లింకును సునీల్ ఏం మిస్ చేసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సునీల్‌, విశ్వంత్ పాత్ర‌లు చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తున్నాయి. పోలీసులు చేసే ఇంట‌రాగేష‌న్‌, ప్రొసీజ‌ర్స్‌,  పోర్ష‌న్స్‌, బ్యాక్‌డ్రాప్ అనేది చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తుంది.

నిర్మాత దండ‌మూడి అవ‌నీంద్ర కుమార్ క‌థ వెనుక క‌థ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా, ప్రెస్టీజియ‌స్‌గా రూపొందించిన‌ట్లు విజువ‌ల్స్ చూస్తే క్లియ‌ర్ క‌ట్‌గా అర్థ‌మ‌వుతుంది. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఆడియోను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేస్తుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago