మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్ విట్టా తొలిసారిగా నిర్మాణంలోకి అడుగుపెట్టారు, రాయలసీమ నేపథ్యంలో సాగే కథనాన్ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి హర్ష కొడాలి దర్శకుడు.

ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ‘’ఉత్తుత్త హీరోలు‘’ సినిమా సక్సెస్ అయ్యి మహేష్ విట్ట కు అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని హీరో ప్రదీప్ మాచిరాజు తెలిపారు.

మహేష్ విట్ట ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత మరియు హీరోగా రాబోతున్నాడు. ఈ రాయలసీమ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయి.

“ఉత్తుత్త హీరోలు” రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో హాస్యం మరియు ఉత్కంఠభరితమైన అంశాలను మిళితం చేస్తూ ఆకర్షణీయమైన కథనాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు, అలాగే “రాయలసీమ నుండి వచ్చిన మొదటి కల్ట్ ఫిల్మ్” మరియు చిత్ర షూటింగ్ మొత్తం కడప జిల్లాలో చేసినట్లు, కడప జిల్లా నుండి ఎంచుకున్న 75 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నట్లు మహేష్ విట్ట తెలిపారు. ప్రామాణికమైన రాయలసీమ భాష మరియు యాసలతో, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించడానికి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మహేష్ విట్టాతోపాటు ప్రవీణా సోని, తారక్ సతీష్, వాల్తేర్ వినయ్, రాహుల్ రాజ్ వనం, హర శ్రీనివాస్, భరత్ బెహరా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్ కె జోసెఫ్ సంగీతం సమకూర్చగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జీవన్ బాబు (జెబి). ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago