‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘హే బల్‌వంత్‌’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకపోతుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం తొలిసారిగా, వినూత్నంగా థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్బంగా

నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ”మా బ్యానర్‌లో వచ్చిన తొలి సక్సెస్‌ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతృప్తి చెందారు. ఓ మంచి సినిమా తీశానని అభినందించారు. కొన్ని థియేటర్స్‌కి వెళ్లి నేను ఆడియన్స్ మధ్యలో సినిమా చూశాను. సినిమాను అందరూ ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు ఇది ఎంతో సంతృప్తి నిచ్చింది. ఓ మంచి సినిమా తీశాననే భావన కలిగింది. తప్పకుండా సినిమా చూడని వాళ్లు అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.


దర్శకుడు గోపీ అచ్చెర మాట్లాడుతూ ” ఈ మూవీ చూసిన అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూఎస్‌లో ఆడియన్స్‌ కు కూడా ఈ సినిమా నచ్చింది. ఈ సక్సెస్‌కు కారణమైన అందరికి నా కృతజ్క్షతలు’ అన్నారు.

హీరోయిన్‌ శివానీ నాగారం మాట్లాడుతూ ” ఈసినిమాకు విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్క్షతలు. మా కంటెంట్‌ను ఎంకరైజ్‌ చేసి లవ్‌ చేసిన అందరికి థ్యాంక్స్‌. అందరికి నచ్చే కంటెంట్‌ ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అంటున్నారు. సినిమా కోసం టీమ్‌ అంతా కష్టపడ్డారు’ అన్నారు.

సుహాస్‌ మాట్లాడుతూ ” అంబాజీ పేట సినిమా తరువాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్‌ నెంబర్లు కూడా కనబడకపోవడంతో భయమేసింది. ఈసినిమా వసూళ్లు చూసిన ధైర్యం వచ్చింది. ఓవరసీస్‌లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. చాలా రోజుల తరువాత నా సినిమా ఓటీటీ కూడా మంచి ఫ్యాన్సీ రేటు వచ్చింది. ఇందుకు కారణమైన నిర్మాత నరేంద్ర రెడ్డి, వంశీ నందిపాటిలకు థ్యాంక్స్‌’ అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ” చాలా హ్యపీగా ఉంది. ఈ సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ కావడం నాకు ఎంతో హ్యపీనెస్‌ ఇచ్చే విషయం. చాలా తక్కువ మంది మాత్రమే మా సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని దైర్యంగా చెబుతారు.అలాంటి కోవలోకి మా హే బల్‌వంత్‌ నిలిచినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత నిలబడితే ఎన్నో మంచి సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్‌ మనీ రికవరీ అయితేనే ఆ సినిమా సక్సెస్‌ఫుల్‌ సినిమాగా నిలుస్తుంది. ఆ విషయంలో ఈ సినిమా విజయం సాధించింది. త్వరలోనే దర్శకుడు గోపీతో మరోసినిమా చేస్తున్నాం. ఈ సినిమాను దాదాపు 10 క్లోట బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్‌ ఇతర హక్కులు, థియేటర్స్‌ కలెక్షన్స్‌ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్‌ జోన్‌లోకి వెళతాం అన్నారు.

నంది అవార్డు అందుకోవాలనేది నాకల : నిర్మాత వంశీ నందిపాటి
”ఈవెంట్‌లో చిన్నగా మాట దొర్లాను. అది నా స్టేట్‌మెంట్‌ కాదు. తప్పుగా వెళ్లింది.ఎవరో 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్‌మెంట్‌ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అన్నారు. నాకు దేవుడి మీద , అవార్డ్స్‌ మీద అపారమైన గౌరవం వుంది. దేవుడి అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్‌ మీద కూడా గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్‌ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్‌ గురించి నేను తప్పుగా మాట్లాడను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉండే ఐయామ్‌ రియల్లీ సారీ’ అన్నారు. ఈ సమావేశంలో స్రవంతి చొక్కారపు, లావణ్యరెడ్డి, మహి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago