సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత, నటుడు అశోక్ కుమార్, రామ సత్య నారాయణ రాజు, లైన్ వెంకట్, కన్నా రవి, రామకృష్ణ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..
నిర్మాత, హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘సతీష్ గారు ‘సన్ ఆఫ్’ కథను నాకు చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఆయన చెప్పిన కథను విన్న తరువాత నా జీవితంలో జరిగినట్టుగానే ఉంది కదా అని అనిపించింది. యదార్థ ఘటనలతో ఈ మూవీని తెరకెక్కించారని కూడా చెప్పుకోవచ్చు. నాన్న మనకు క్రమ శిక్షణ, చదువు, సమయ పాలన వంటివి ఇస్తారు. డబ్బుని కాకుండా కష్టపడే తత్వాన్ని వారసత్వంగా ఇవ్వాలి. శోభా రాణి గారి వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. నేను ఐదు థియేటర్లు అడిగితే శోభమ్మ నాకు 300 థియేటర్లు ఇచ్చారు. ఫిబ్రవరి 27న మా సినిమా రాబోతోంది. తండ్రీకొడుకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన చిత్రమిది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు.
నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ టైటిల్ చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో సినిమా ఉంటుందని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. సాయి అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి ఇలాంటి ఓ గొప్ప సినిమా తీస్తుండటం మంచి విషయం. మీరా రాజ్ ఈ మూవీలో చక్కగా కనిపిస్తున్నారు. మంచి సెంటిమెంట్‌తో, ఎమోషన్‌తో ఫిబ్రవరి 27న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ శోభా రాణి మాట్లాడుతూ .. ‘సాయి సింహాద్రి ‘సన్ ఆఫ్’ రిలీజ్ విషయంలో ఇబ్బంది పడ్డాడు. ఆ టైంలో సింహాద్రి నా వద్దకు వచ్చాడు. ఐదు థియేటర్లో రిలీజ్ చేస్తే చాలు అని సింహాద్రి అన్నాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అందరూ ఈ మూవీ కంటెంట్ చూసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. అన్ని భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నామ’ని అన్నారు.
హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ జర్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎంతో పాజిటివ్‌గా షూటింగ్ కంప్లీట్ అయింది. అదే పాజిటివిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి సింహాద్రి, సతీష్ గారికి థాంక్స్. ఫిబ్రవరి 27న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత రామ సత్య నారాయణ రాజు మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీని శోభా రాణి గారు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరో మూవీని ఏ రేంజ్‌లో రిలీజ్ చేస్తారో.. అదే స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ తరువాత ‘సన్ ఆఫ్’ రేంజ్ మారిపోయింది. ఫిబ్రవరి 27న ఈ మూవీ పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రిషి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఫిబ్రవరి 27న మా చిత్రం రాబోతోంది. నాకు ఇది తొలి సినిమా. నాకు ఈ అవకాశం ఇప్పించిన భాస్కర భట్ల గారికి థాంక్స్. సాయి సింహాద్రి గారు ఈ మూవీకి ప్రాణం పెట్టి పని చేశారు. ఆదిత్య మ్యూజిక్ మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 27న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త కన్నా రవి మాట్లాడుతూ .. ‘సాయి సింహాద్రి నిర్మించిన ఈ మూవీని శోభా రాణి గారు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘సన్ ఆఫ్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ .. ‘శోభా రాణి గారు సినిమాల్ని అద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ‘సన్ ఆఫ్’ చిత్రంలో సాయి సింహాద్రి గారు, మీరా గారు అద్భుతంగా ఉన్నారు. ఫిబ్రవరి 27న రాబోతోన్న ఈ మూవీని పెద్ద హిట్ చేయాలని ఆడియెన్స్‌ను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రమా దేవి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. చిత్రాన్ని కూడా చూశాను. ఈ మూవీ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత వెంకట్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీ ఫిబ్రవరి 27న 300 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక రేర్ రికార్డ్. సాయి సింహాద్రి, మీరా జంట చూడముచ్చటగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత కరుణ లక్ష్మీ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా నాన్న నట్టి కుమార్ గారు ఊర్లో లేరు. అందుకే నేను వచ్చాను. ‘సన్ ఆఫ్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘శోభా గారు ‘సన్ ఆఫ్’ మూవీని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆమె ప్రోత్సాహం వల్లే ఈ చిత్రం ఈ రేంజ్‌లో విడుదల అవుతోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ దర్శకుడు చరణ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీని నేను చూశాను. ఈ సినిమా చాలా బాగుంది. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సూరీడు’ రేంజ్‌లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ వేణు మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ సినిమాని నేను చూశాను. నైజాంలో ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సాయి సింహాద్రి, శోభా రాణి గారి వల్లే ఈ సినిమా నాకు వచ్చింది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుంది’ అని అన్నారు.
పూర్ణిమ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ కోసం సాయి సింహాద్రి చాలా కష్టపడ్డారు. ఎంతో పర్‌ఫెక్షన్‌తో పని చేస్తుంటారు. మూడు వందల థియేటర్లలో రిలీజ్ అవుతుండటం మామూలు విషయం కాదు. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ మూవీని మాకు ఇచ్చినందుకు థాంక్స్. ఇప్పటికే పాటలు పెద్ద హిట్ అయ్యాయి. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…