జాతీయ అవార్డు గెలుచుకున్న నటి, ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
ట్రైలర్ లో కాలేజీకి వెళ్లే అమ్మాయి కిడ్నాప్ చేసి, ఏకాంత ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేయాలని గూండాలు ప్లాన్ చేస్తారు. ఆమె వారి నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఆమెను తీవ్రంగా గాయపరుస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఆమెకు పోరాటం తప్పా మరో మార్గం లేదు.
హర్ష వర్ధన్ తన గ్రిప్పింగ్ కథనంతో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ఎంగెజింగా వుంది. రితికా సింగ్ ఎక్స్ టార్డినరీగా పెర్ఫార్మ్ చేసింది. నిజానికి అలాంటి పాత్రను అంగీకరించే దమ్ము ఉండాలి.
ఈ చిత్రానికి మిథున్ గంగోపాధ్యాయ సినిమాటోగ్రఫీ, మానిక్ దివార్ ఎడిటర్. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను సునీల్ రోడ్రిగ్స్ పర్యవేక్షించారు. ఇన్ కార్ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది.
తారాగణం: రితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…