“సంతాన ప్రాప్తిరస్తు” ప్రీమియర్ షోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేట్రికల్ గా కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని ఆశిస్తున్నాం – నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఏ సినిమా చేసినా అందులో పర్పస్ ఉండాలని కోరుకునే దర్శక నిర్మాతను నేను. సినిమాలో వినోదంతో పాటు ఒక చిన్న మెసేజ్ ఏదైనా ఉండాలని ప్రయత్నిస్తాను. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను కూడా అలాగే ఫన్, మెసేజ్ తో నిజాయితీగా ప్రయత్నం చేశాం. తెలుగు సాహిత్యానికి సినిమాకు మధ్య గ్యాప్ వచ్చింది. అందుకే వైవిధ్యమైన చిత్రాలు తగ్గిపోయాయని నా అభిప్రాయం. మన లిటరేచర్ తో ట్రావెల్ అయితే తెలుగులోనూ మలయాళ ఇండస్ట్రీలోలా కొత్త తరహా మూవీస్ చేయొచ్చు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వస్తున్న రెస్పాన్స్ తో సంతృప్తిగా ఉన్నాం. ఇదే రెస్పాన్స్ రేపు థియేట్రికల్ గా వస్తే ఇంకా సంతోషిస్తాం. సినిమా విజయంపై మా టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్ తో పాటు కొన్ని సౌత్ స్టేట్స్ లోనూ సినిమా విడుదలవుతోంది. మన దగ్గర వచ్చే టాక్ ను బట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ వస్తుందని నమ్ముతున్నాం. యూఎస్ లో నెంబరాఫ్ లొకేషన్స్ దొరికాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు యూఎస్ లో రిలీజ్ చేస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో మొదట్లో భయంగా ఉండేది కానీ వాళ్లు యూఏ సర్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ఫ్యామిలీతో కలిసి మా సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్టర్ సంజీవ్ తో నాది లాంగ్ జర్నీ. ఈ సినిమాను కష్టపడి చేశాడు. హీరో విక్రాంత్ కు మంచి పేరు తెచ్చే మూవీ అవుతుంది. ఈ సినిమా తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేయాలంటే విక్రాంత్ ను మేకర్స్ అప్రోచ్ అవుతారు. ఇన్ ఫెర్టిలిటీ మన ఆడియెన్స్ కు కొత్త విషయం కాదు. మనం చదువుకునే రోజుల నుంచే ఇలాంటి విషయాలపై అవగాహన ఉంది. ఓటీటీల్లో వెర్సటైల్ కంటెంట్ చూస్తున్న తెలుగు ఆడియెన్స్ ఇన్ ఫెర్టిలిటీ నేపథ్యంగా తీసిన సినిమాను చూసేందుకు సందేహిస్తారని అనుకోవడం లేదు. ఇండస్ట్రీలో మా సర్కిల్ లో మూవీ చూపించాం. అయితే ప్రివ్యూలు వేసినప్పుడు థియేటర్స్ లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మరికొన్ని ప్రివ్యూస్ వేస్తున్నాం. నిజాయితీగా మేము చేసిన ప్రయత్నాన్ని క్రిటిక్స్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్స్ విజిట్, సక్సెస్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – నేను కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేశాను. మనం చేసే సినిమా వల్ల సమాజానికి చెడు జరగకూడదు అని ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అలాగే శ్రీధర్ గారి స్నేహంలో పర్పస్ ఫుల్ సినిమాలు చేయాలనే ఆలోచనలు బలపడ్డాయి. మన చుట్టూ ఉంటే వ్యక్తుల ప్రభావమే మనపై ఉంటుంది. నాకు ఉన్న ఈ స్నేహితులు మంచి కంటెంట్ ప్రేక్షకులకు ఇచ్చేందుకు ఇన్స్ పైర్ చేస్తున్నారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో మేము ఏ ఏ సీన్స్ లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని ఆశించామో వాటితో పాటు మేము ఎక్స్ పెక్ట్ చేయని సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న మూవ్ మెంట్స్ కు కూడా నవ్వుతుున్నారు. ప్రివ్యూస్ వేసిన థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం. మూవీలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మెసేజ్ ఉంటుంది. ఏ సినిమా అయినా చివరలో ఒక మంచి మాట చెబితేనే ఆ మూవీకి ఒక పర్పస్ ఏర్పడుతుంది. రేపు మా మూవీ రిలీజ్ కు వస్తోంది. థియేట్రికల్ గా వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” ప్రివ్యూస్ చూసిన ఆడియెన్స్ వచ్చిన రెస్పాన్స్ తో మేము ఈ సినిమాకు పడిన కష్టం ఫలించింది అనిపించింది. మా మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రివ్యూస్ లోనే తెలిసిపోయింది. మీరు ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుని చివరలో చిన్న ఎమోషన్ ఫీల్ అయి, ఒక మంచి మెసేజ్ తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ప్రివ్యూస్ లో సినిమా చూస్తున్నంత సేపు ఎవరూ తమ ఫోన్స్ కూడా చూడలేదు. అంతగా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సెన్సార్ నుంచి యుఎ సర్టిఫికేషన్ వచ్చింది. అన్ని ఎజ్ గ్రూప్స్ ఆడియెన్స్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. నన్ను ఈ చిత్రంలో చైతన్య పాత్ర కోసం మలిచి, బాగా పర్ ఫార్మ్ చేయించిన మా దర్శకుడు సంజీవ్ రెడ్డి గారికి, నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా శ్రీధర్ గారికి థ్యాంక్స్. అన్నారు.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్.జి
సినిమాటోగ్రఫీ – మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
ఎడిటర్ – సాయికృష్ణ గనల
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె.ప్రతిభ రెడ్డి
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూధన్ రెడ్డి
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్)
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…