Categories: Uncategorized

“కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యం లో సురేష్ తేజ్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 మూవీ అనౌన్స్ మెంట్

“కె ర్యాంప్” వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాలో “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా నటిస్తున్నారు. సురేష్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి డి.జి.పి. అనే వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు.

వెంకటేష్.వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సుడా సుడా ఇడ్లీ అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమాలో మురుగన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రోజు హీరో వెంకటేష్. వి.పి. బర్త్ డే సందర్భంగా ఆయనకు మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలోకి వెల్ కమ్ చెప్పారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ, డైరెక్టర్ సురేష్ తేజ్ తిరువనంతపురంలో తన రెస్టారెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న హీరో వెంకటేష్ తో ఫోన్ లో మాట్లాడి తమ సినిమాలో హీరోగా తీసుకుంటున్నట్లు చెబుతారు. విలన్ రోల్ కు ఆఫర్ ఇస్తున్నారని అనుకున్న వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపించడు. కానీ తనను విలన్ రోల్ కోసం కాదు, హీరోగా తమ సినిమాకు తీసుకుంటున్నామని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. ఈ మూవీ స్క్రిప్ట్ విని మరింత ఇంప్రెస్ అవుతాడు హీరో. ఇలా సరదాగా చేసిన ఈ వీడియో ఫన్ గా ఉండి నవ్విస్తోంది.

నటీనటులు – వెంకటేష్. వి.పి., తదితరులు

టెక్నీషియన్స్

కాస్ట్యూమ్స్ – జ్ఞానేశ్వరి
ఆర్ట్ డైరెక్టర్ – తిరుమల ఎం. తిరుపతి (ఎంఎఫ్ఎ)
ఎడిటర్ – కార్తీక్ వేద్
డైలాగ్స్ – గడ్డం సురేష్
డీవోపీ – హరి వరణ్
మ్యూజిక్ – గ్యాని
సీయీవో – ధీరజ్ న్యాతి
ప్రొడ్యూసర్ – బొమ్మక్ శివ
స్క్రిప్ట్, డైరెక్షన్ – సురేష్ తేజ్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago