Categories: Uncategorized

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఎస్ సాయి ప్రసాద్ తో కీలక సమావేశంలో పాల్గొన్న APSFTVTDC చైర్మన్ భరత్ భూషణ్, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్, పలు శాఖల అధికారులు

ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోని కీలక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారితో కలిసి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందే దిశగా చర్చించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా APSFTVTDC చైర్మన్ భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం అభివృద్ధి చెందే విధంగా, ముఖ్యంగా సినిమా షూటింగులు గురించి ప్రభుత్వ అధికారులు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సినిమాలకు సంబంధించిన షూటింగులు, వాటి పర్మిషన్లు త్వరగా అందేలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వాలని చర్చలు జరిగాయి. షూటింగ్లో విధివిధానాలు గురించి అన్ని డిపార్ట్మెంట్స్ వారితో చర్చిస్తూ సమావేశం విజయవంతంగా జరిగింది. సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి చెందాలని అందరూ ఆకాంక్షిస్తూ షూటింగులు ఎక్కడ లేట్ అవ్వకుండా పర్మిషన్లు ఇచ్చే విధంగా సింగిల్ విండో విధానం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందరి నుండి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడం శుభసూచకంగా భావిస్తున్నాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో షూటింగులు జరుగుతున్నప్పటికీ ఈ షూటింగ్ పర్మిషన్స్ మరింత వేగంగా వచ్చేలా ఎటువంటి ఇబ్బంది పడకుండా జరగాలని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఉండాలని నిర్ణయించుకున్నాము. ఈ విధానాన్ని త్వరలో ప్రారంభించి పూర్తి వివరాలను వెల్లడిస్తాము” అన్నారు.

ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారితో సహా ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజీత్ గారు, PCCF చలపతి రావు గారు, CFF ఎన్ ఎన్ రావు గారు, శశి భూషణ్ కుమార్, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, సంపత్ కుమార్, యువరాజ్, కన్నబాబు, ఆమ్రపాలి, ప్రవీణ్ ఆదిత్య, శుభం బరన్సాల్, భరణి, పద్మావతి, వెంకటరమణ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరోక్షంగా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

3 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

4 days ago