‘జీరో’మూవీ గ్లింప్స్ చాలా అద్భుతంగా వుంది : తనికెళ్ళ భరణి

Must Read

వెర్సటైల్ యాక్టర్ శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా లక్ష్మీనారాయణ.సి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి విలా సినిమాస్ బ్యానర్ పై ఆర్.లక్ష్మణ్ రావు, ఆర్.శ్రీను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘జీరో’అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఈ గ్లింప్స్ ని లాంచ్ చేశారు.

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో యాక్టర్ తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో శివాజీ రాజా ఆత్మబంధువు లాంటి వ్యక్తి. తనతో ఎన్నోఏళ్ల అనుబంధం వుంది. ‘జీరో’ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. సినిమా హీరోకి కావాల్సిన కసి విజయ్ రాజాలో కనిపించింది. మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. డైరెక్టర్ చాలా ఎమోషనల్ గా తీశారు. నిర్మాతలు చాలా పాషన్ తో ఈ సినిమా నిర్మించారు. వారికి తప్పకుండా అందరి ఆశీస్సులు వుంటాయి. శివాజీ రాజాని ఎలా ఆదరించారో, నన్ను ఎలా గౌరవించారో..  విజయ్ రాజాని కూడా అలానే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తండ్రిలానే మంచి పేరు సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  

యాక్టర్ శివాజీ రాజా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. భరణి అన్నయతో నాకు ఎంతో అనుబంధం వుంది. ఆయనకి డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సందర్భంగా వారికి అభినందనలు. ‘జీరో’ గ్లింప్స్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా నిర్మాతలకు సినిమా అంటే చాలా పాషన్. డైరెక్టర్ గా అద్భుతంగా సినిమాని తీశారు. సాయి కార్తిక్ చాలా మంచి పాటలు ఇచ్చారు. సినిమా చాలా బావొచ్చింది. ప్రేక్షకులందరూ మా అబ్బాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ’ అన్నారు.      

హీరో విజయ్ రాజా మాట్లాడుతూ..ఈ ఈవెంట్ కి వచ్చి మాకు సపోర్ట్ చేసిన తనికెళ్ళ భరణి గారికి థాంక్ యూ సో మచ్. నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిన అమ్మనాన్నలకు థాంక్ యూ. సాయి కార్తిక్ గారు అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. దర్శక నిర్మాతలకు థాంక్. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది’అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. నిర్మాతలు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. విజయ్ సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. ఒక అథ్లెట్ ఎదుర్కుకునే సవాళ్ళని చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ లక్ష్మీనారాయణ.సి.. మన స్పోర్ట్స్ లో వుండే పాజిటివ్స్ , నెగిటివ్స్ నిన్ బేస్ చేసుకొని ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని తీశాం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, హీరో విజయ్ రాజా కి థాంక్ యూ. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు

నిర్మాత ఆర్.శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది మా ప్రొడక్షన్ నెంబర్ 2. విజయ్ రాజా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. షూ లేకుండా పరిగెత్తేవారు. ఆయన కష్టం చూస్తే చాలా ఎమోషనల్ గా కనిపించింది. సినిమా తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు  

నిర్మాత ఆర్.లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. ఈ సినిమాలో  అందరికీ కనెక్ట్ అయ్యే ఇంట్రస్టింగ్ పాయింట్ వుంది. మనం అందరం ఎదో ఒక స్పోర్ట్ ఆడే వుంటాం.  రెండో సినిమాగా ఈ మూవీని చేయడం చాలా ఆనందంగా వుంది. మంచి టీంతో ఈ సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది’ అన్నారు  

నటీనటులు- విజయ్ రాజా రాజేంద్ర ప్రసాద్, ఆమని, శివాజీ రాజా, సంపత్ రాజ్, ఎల్సా ఘోష్, రూప లక్ష్మి, వినయ్ మహదేవ్

బ్యానర్ – సాయి విలా సినిమాస్
నిర్మాతలు: ఆర్.లక్ష్మణ్ రావు, ఆర్.శ్రీను
దర్శకత్వం: లక్ష్మీనారాయణ.సి
డీవోపీ: దాము నర్రావుల
సంగీతం: సాయి కార్తీక్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News