బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోన్న‌ నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’

Must Read

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఐదు రోజుల్లోనే క‌మిటీ కుర్రోళ్ళు సినిమా రూ. 8.49 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టం విశేషం.

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.

Latest News

TFJA ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ పరీక్షలకు విశేష స్పందన

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26 న) ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం...

More News