గ్రాఫిక్స్ – విజువల్ ఎఫెక్ట్స్ వల్లబడ్జెట్ పెరగదు – తగ్గుతుంది!!

Must Read

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్”తో
అద్భుతాలు అలవోకగా ఆవిష్కరించవచ్చు!!

“గీతాంజలి-2″కి గ్రాఫిక్స్ అద్దే
అవకాశం ఇచ్చిన కోన వెంకట్ సార్’కి
ఎప్పటికీ రుణపడి ఉంటాను!!

-గ్రాఫిక్ & విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్
ఉదయ్ తిరుచినాపల్లి

గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనగానే… అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే” అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచినాపల్లి. అంతేకాదు… గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా, పెద్ద సినిమాల బడ్జెట్ ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని, ఇక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్”తో అలవోకగా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని ఘంటాపధంగా చెబుతున్నాడు!!

కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన ఉదయ్ తిరుచినాపల్లి… అమెరికా, ఆస్ట్రేలియాలో మల్టీ నేషనల్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశాడు. అయితే చిన్నప్పటి నుంచి “సినిమా పిచ్చోడైన” ఉదయ్… విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూనే… “అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్”లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. జాబ్ చేస్తూనే, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కి పని చేస్తూ… తన స్కిల్స్’కి పదును పెట్టుకున్న ఉదయ్… కొన్నేళ్ల క్రితం, ఉద్యోగానికి స్వస్తి చెప్పి… సినిమాలకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం ప్రధాన వ్యాపకం చేసుకున్నాడు!!

పలు ఇంగ్లీష్ సినిమాలకు ఈ విభాగాల్లో పనిచేసి, తన ఉనికిని, ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న ఉదయ్… “హౌ ఈజ్ దట్ ఫర్ ఎ మండే” (HOW IS THAT FOR A MONDAY) అనే ఆంగ్ల చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ సూపర్’వైజర్’గా పని చేశాడు. ఈ చిత్రం “ఈటివి విన్”లోనూ ప్రసారమవుతుండడం విశేషం. అలాగే విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుని “జీ-5″లో ప్రసారమవుతున్న “8 ఎ.ఎమ్.మెట్రో”కు కూడా గ్రాఫిక్స్ అందించాడు. ఈ చిత్రాన్ని “మల్లేశం” ఫేమ్ రాజ్ రాచకొండ రూపొందించి ఉండడం విశేషం. “సాచి” చిత్రానికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ సొబగులు అద్దిన ఈ యువ ప్రతిభాశాలి… సెన్సేషనల్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ “గీతాంజలి – మళ్లీ వచ్చింది” చిత్రానికి పని చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతాడు. ఈ చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తన మీద ఎంతో నమ్మకం ఉంచి, తనకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన కోన వెంకట్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని తెలిపాడు!!

Latest News

Nandamuri Balakrishna The Rage of Daaku Song from Daaku Maharaaj Released!

The lyrical video of The Rage of Daaku from the upcoming action-packed entertainer Daaku Maharaaj has been unveiled, delivering...

More News