*యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రెస్టీజియస్ మూవీ ‘వార్ 2’ ఆగస్ట్ 14న గ్లోబల్ రేంజ్‌లో ఐమ్యాక్స్ థియేటర్స్‌లో రిలీజ్
YRF స్పై యూనివర్స్‌లో వార్ 2 చిత్రం లేటెస్ట్‌గా రూపొందిన భారతదేశపు అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఫిలిం ఫ్రాంచైజీలలో ఒకటి. పఠాన్, టైగర్ 3, WAR మొదటి భాగం వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత రాబోతున్న కొత్త మూవీ ఇది. 2023లో విడుదలైన పఠాన్ భారతీయ బాక్సాఫీసులో అత్యధిక IMAX కలెక్షన్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇది ఈ స్పై యూనివర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తోంది.
WAR 2 కి సంబంధించి YRF సంస్థ వార్ 2 రిలీజ్‌కు ఇంకా 50 రోజులు మాత్రమే ఉందని తెలియజేసే సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ల పోస్టర్లను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘యశ్ రాజ్ ఫిలింస్‌గా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. వార్ 2 అనేది YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఇండియన్ సినిమాలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే ఈ అద్భుతమైన తలపోరును IMAX ఫార్మాట్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించగలగుతాం’ అన్నారు.
IMAX ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ టిల్ల్మాన్ మాట్లాడుతూ, “వార్ 2 అనే ఈ భారీ ఇండియన్ యాక్షన్ చిత్రాన్ని గ్లోబల్ IMAX థియేటర్లకు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ఈ ఏడాదిలో అతి పెద్ద ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్, ఆదిత్య చోప్రాతో చేతులు కలపటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు అయ్యన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమా యాక్షన్ సినిమాకే ఓ పాఠంలా ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు, వారి అద్భుతమైన పెర్ఫామెన్స్‌లు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. ఇలాంటి తిరుగులేని, మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఐ మ్యాక్స్‌లో మాత్రమే పొందగలరు. ,” అని అన్నారు.
అద్భుతమైన విజువల్స్, వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన వార్2 ను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. అతి పెద్దగా ఉండే ఐ మ్యాక్స్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్, ఆకట్టుకునే సౌండింగ్‌తో సినిమాను రూపొందించారు.
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇప్పటికే WAR 2 IMAX టీజర్ ప్రదర్శన మొదలైంది. పూర్తి చిత్రం ఆగస్టు 14, 2025న IMAXలో మాత్రమే విడుదల అవుతుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…