మిథున్, అర్జిత్‌తో కలిసి ప్రజలంతా గుర్తు పెట్టుకునే ఓ పాటను ఇవ్వాలని అనుకున్నాను..
‘సయారా’ నుంచి రానున్న ‘ధన్’ కోసం అర్జిత్ సింగ్, మిథున్, మోహిత్ సూరి సంగీత త్రయం తిరిగి వచ్చింది. ఈ ముగ్గురూ హిందీ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద చారిత్రాత్మక చార్ట్‌బస్టర్‌లను సృష్టించారు. ఆషికి 2 నుంచి ‘తుమ్ హి హో’ వంటి గీతాన్ని ఈ ముగ్గురూ కలిసి సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
‘సమయం కలిసి వచ్చినప్పుడు ఓ మాయాజాలం జరుగుతుందని చెబుతుంటారు. నా జీవితంలో మిథున్, అరిజిత్ సింగ్ వంటి వారు నాకు దొరకడం అదృష్టం. మన దేశంలోని ఈ ఇద్దరు కళాకారులతో నా ఉత్తమ సంగీతాన్ని సృష్టించే అదృష్టం నాకు కలిగింది. మిథున్ మరియు నా సహకారం, నేను కలిసి 2005లో ‘జెహెర్’, ‘కలియుగ్’ సినిమా చేశాం. మా ఇద్దరి జర్నీ మొదలై 20 సంవత్సరాలు అయింది. 2005 నుంచి మిథూన్‌తో కలిసి ‘మర్డర్ 2’, ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’, ‘హమారి అధూరి కహానీ’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘మలంగ్’ వంటి చిత్రాలు చేశాము. మేం ఎన్నో కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ పాటల్ని అందించాం.
“మిథున్, నేను కలిసి పనిచేసినప్పుడల్లా గొప్ప ట్రాక్ అందించాలని ప్రయత్నిస్తుండేవాళ్లం. మా మీద ఎప్పుడూ పెద్ద అంచనాలుంటాయి. ఆ ఒత్తిడిని మేం ఆస్వాధిస్తుంటాం. అర్జిత్ సింగ్ నాకు ఈ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకాలను ఇచ్చిన గాయకుడు. ‘ఆషికి 2’ నుంచి ‘తుమ్ హి హో’, ‘చాహున్ మై యా నా’, ‘హమ్ మార్ జాయేంగే’, ‘ఏక్ విలన్’లోని ‘హమ్‌దార్ద్’, ‘హమారీ అధూరి కహానీ’ టైటిల్ ట్రాక్ వరకు, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’లోని ‘ఫిర్ భీ తుమ్కో చాహుంగా’, ‘మలాంగ్’లోని ‘చల్ ఘర్ చలేన్’ వంటి పాటలెన్నో క్లాసిక్‌గా నిలిచాయి.
మిథున్, అరిజిత్, నేను కలిసి పని చేస్తున్నప్పుడు ప్రజలు గుర్తుండిపోయే పాట ఇవ్వాలని కోరుకుంటారు. ప్రజల్లో మాపై ఉండే అంచనాల గురించి తెలుసు. మేము ముగ్గురం మళ్ళీ ‘సయారా’లో ‘ధన్’ కోసం జతకట్టాం. ఈ ట్రాక్ మాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేమలో, జీవితంలో జరిగే పోరాటాన్ని జరుపుకునే పాట. జీవితం పూల పాన్పు కాదు. ధన్ అనే పాట స్పూర్తిని నింపేలా ఉంటుంది’ అని మోహిత్ సూరి అన్నారు.
‘సయారా’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన నాలుగు పాటలు చార్ట్ బస్టర్‌లు నిలిచాయి. ఇక ఇప్పుడు ‘ధన్’ అనే పాటను రిలీజ్ చేయబోతోన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంతో అహాన్ పాండేను హీరోగా పరిచయం చేయనున్నారు. అనీత్ పడ్డా హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సయారా సినిమాను అక్షయ్ విధాని నిర్మించారు. ఈ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…