పాన్‌ సౌత్ స్టార్‌తో సైకాలజికల్ థ్రిల్లర్.. అనుపమ పరమేశ్వరన్ కొత్త మూవీ అనౌన్స్!

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్ (Ess Kay Gee Entertainment), బెంచ్‌మార్క్ స్టో రీటెల్లర్స్ (Benchmark Storytellers) సంయుక్తంగా ప్రకటించాయి. ఈ చిత్రానికి ఆర్జే షాన్ (RJ Shaan) దర్శకత్వంవహించనుండగా.. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ స్టూడియోతో భాగస్వామ్యంగా ఈ సినిమా నిర్మితమవుతుంది.

ఈ ప్రాజెక్ట్ ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. గతంలో అనుపమ–షాన్ కాంబినేషన్‌లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌కు అద్భుత స్పందన రావడంతో.. ఇప్పుడు అదే జోడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇద్దరి కాంబోలో డిజిటల్ హిట్ తర్వాత బిగ్ స్క్రీన్‌పై ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. మూవీ టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. అనుపమ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ చేశారు. మేకర్స్ అనుపమకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

ఇటీవలే ‘జటాధర’ మూవీని నిర్మించిన ఎస్కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ సంస్థ నిర్మాణంను మరింత విస్తరిస్తోంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇక అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రేమమ్, కార్తికేయ 2, రాక్షసుడు వంటి హిట్ సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరిగా అనుపమ కొనసాగుతున్నారు. ఈ కొత్త థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో అను మరోసారి తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

6 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

6 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

6 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago