‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్ విట్టా తొలిసారిగా నిర్మాణంలోకి అడుగుపెట్టారు, రాయలసీమ నేపథ్యంలో సాగే కథనాన్ని ఎంచుకున్నారు.
మహేష్ విట్ట ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత మరియు హీరోగా రాబోతున్నాడు. ఈ రాయలసీమ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయి.
“ఉత్తుత్త హీరోలు” రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో హాస్యం మరియు ఉత్కంఠభరితమైన అంశాలను మిళితం చేస్తూ ఆకర్షణీయమైన కథనాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు, అలాగే “రాయలసీమ నుండి వచ్చిన మొదటి కల్ట్ ఫిల్మ్” మరియు చిత్ర షూటింగ్ మొత్తం కడప జిల్లాలో చేసినట్లు, కడప జిల్లా నుండి ఎంచుకున్న 75 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నట్లు మహేష్ విట్ట తెలిపారు. ప్రామాణికమైన రాయలసీమ భాష మరియు యాసలతో, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించడానికి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మహేష్ విట్టాతోపాటు ప్రవీణా సోని, తారక్ సతీష్, వాల్తేర్ వినయ్, రాహుల్ రాజ్ వనం, హర శ్రీనివాస్, భరత్ బెహరా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్ కె జోసెఫ్ సంగీతం సమకూర్చగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జీవన్ బాబు (జెబి). ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…