‘వార్ 2’ ఆగస్ట్ 14న గ్లోబల్ రేంజ్‌లో ఐమ్యాక్స్ థియేటర్స్‌లో రిలీజ్

Must Read

*యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రెస్టీజియస్ మూవీ ‘వార్ 2’ ఆగస్ట్ 14న గ్లోబల్ రేంజ్‌లో ఐమ్యాక్స్ థియేటర్స్‌లో రిలీజ్

  • 50 రోజుల్లో ‘వార్2’ ..రిలీజ్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ భారతదేశపు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ (YRF). దేశంలో అతిపెద్ద సినిమాటిక్ ఫ్రాంచైజీలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న ఈ సంస్థ, మోస్ట్ అవెయిటింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ఆఫ్ ది ఇయర్ ‘వార్ 2’ను ఆగస్టు 14, 2025న IMAX థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యుకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌతీఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో IMAX థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు నెక్ట్స్ లెవల్లో ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ చిత్రం అందించనుంది.

YRF స్పై యూనివర్స్‌లో వార్ 2 చిత్రం లేటెస్ట్‌గా రూపొందిన భారతదేశపు అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఫిలిం ఫ్రాంచైజీలలో ఒకటి. పఠాన్, టైగర్ 3, WAR మొదటి భాగం వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత రాబోతున్న కొత్త మూవీ ఇది. 2023లో విడుదలైన పఠాన్ భారతీయ బాక్సాఫీసులో అత్యధిక IMAX కలెక్షన్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇది ఈ స్పై యూనివర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తోంది.

WAR 2 కి సంబంధించి YRF సంస్థ వార్ 2 రిలీజ్‌కు ఇంకా 50 రోజులు మాత్రమే ఉందని తెలియజేసే సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ల పోస్టర్లను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘యశ్ రాజ్ ఫిలింస్‌గా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. వార్ 2 అనేది YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఇండియన్ సినిమాలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే ఈ అద్భుతమైన తలపోరును IMAX ఫార్మాట్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించగలగుతాం’ అన్నారు.

IMAX ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ టిల్ల్మాన్ మాట్లాడుతూ, “వార్ 2 అనే ఈ భారీ ఇండియన్ యాక్షన్ చిత్రాన్ని గ్లోబల్ IMAX థియేటర్లకు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ఈ ఏడాదిలో అతి పెద్ద ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్, ఆదిత్య చోప్రాతో చేతులు కలపటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు అయ్యన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమా యాక్షన్ సినిమాకే ఓ పాఠంలా ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు, వారి అద్భుతమైన పెర్ఫామెన్స్‌లు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. ఇలాంటి తిరుగులేని, మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఐ మ్యాక్స్‌లో మాత్రమే పొందగలరు. ,” అని అన్నారు.

అద్భుతమైన విజువల్స్, వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన వార్2 ను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. అతి పెద్దగా ఉండే ఐ మ్యాక్స్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్, ఆకట్టుకునే సౌండింగ్‌తో సినిమాను రూపొందించారు.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇప్పటికే WAR 2 IMAX టీజర్ ప్రదర్శన మొదలైంది. పూర్తి చిత్రం ఆగస్టు 14, 2025న IMAXలో మాత్రమే విడుదల అవుతుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News