మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా ‘వృషభ’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల.. అక్టోబర్ 16న చిత్రం గ్రాండ్ రిలీజ్
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. మాలీవుడ్‌లోనే కాకుండా ప్యాన్ ఇండియా వైడ్‌గా వస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘వృషభ’ చిత్రం ఒకటి. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతోన్న ఈ చిత్రం నుంచి మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘వృషభ’ నుంచి రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో మోహన్‌లాల్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. మోహన్‌లాల్ ఆహార్యం, కనిపించిన విధానం, ఆ కత్తి పట్టుకున్న తీరు, జుట్టు ఎగురుతున్న స్టైల్ ఇవన్నీ చూస్తుంటే ఇందులో ఉత్తమ యోధుడిలా కనిపించబోతోన్నారనిపిస్తోంది. ‘నా అభిమానులకు బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను అంకితం చేస్తున్నాను.. ఇకపై వారి ఎదురుచూపులకు తెర దించినట్టే.. అందరినీ కట్టి పడేసేలా, అందరినీ ఆకట్టుకునేలా ‘వృషభ’ చిత్రం ఉంటుంది’ అని మోహన్‌లాల్ పోస్ట్ వేశారు.
కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్ సమర్పణలో నంద కిషోర్ రచన, దర్శకత్వంలో ‘వృషభ’ రాబోతోంది. యాక్షన్, ఎమోషన్, పౌరాణిక గాథలను అద్భుతంగా మిళితం చేసి ఓ దృశ్య కావ్యంలా సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ మూవీనీ అక్టోబర్ 16, 2025న తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ అనే ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతాతో వంటి వారు ఈ ‘వృషభ’ చిత్రీకరణలో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అందరి సమిష్టి కృషితో ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా రూపొందిస్తున్నారు.
ఉత్కంఠభరితమైన విజువల్స్, భావోద్వేగంతో కూడిన సన్నివేశాల నుంచి భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలతో ‘వృషభ’ ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపనుంది. ఈ సినిమాను అక్టోబర్ 16, 2025న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…