“ప్రభాస్ నిమ్మలతో కలిసి”మిరాకిల్” చేద్దాం రండి” అంటున్నహీరోయిన్ హెబ్బా పటేల్!!

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాకిల్”. “సత్య గ్యాంగ్, ఫైటర్ శివ” చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్… ఈనెల 24 (ఫిబ్రవరి 24) నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్న మూడో షెడ్యూల్ లో సెట్స్ లో జాయిన్ కానుంది!!

రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్ గా పరిచయమవుతున్నాడు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), సమీర్ దత్తా, అనుశ్రీ, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!!

నిర్మాతలు మాట్లాడుతూ…. “సత్యా గ్యాంగ్, ఫైటర్ శివ” చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రభాస్ నిమ్మల తన మూడో చిత్రంతో “మిరాకిల్” చేయబోతున్నారు. హెబ్బా పటేల్ గ్లామర్, సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ పోషిస్తున్న కీలక పాత్రలు, ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ “మిరాకిల్” చిత్రానికి ముఖ్య ఆకర్షణలు కానున్నాయి. మూడో షెడ్యూల్ ఈనెల 24 నుంచి జరగనుంది” అని అన్నారు!!

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: సురేందర్ రెడ్డి, ఎడిటింగ్: విశ్వనాధ్, లిరిక్స్: రాంబాబు గోసాల, ఫైట్స్: శ్రీను, సహనిర్మాత: శ్రీమతి జ్యోత్స్న, నిర్మాతలు: రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల!!

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago