ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఆరు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

▶️https://zee5.onelink.me/RlQq/lingy99k

‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. ‘నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?’.. ‘ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి’ అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ‘కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను’ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో చాలానే ట్విస్టులు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది.

ఇక స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్ అయింది? దీని వెనుకున్నది ఎవరు? హాస్టల్‌లో స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఇక ఈ మిస్టరీలు తేలాలంటే ఫిబ్రవరి 27 వరకు ఆగాల్సిందే. జీ5లో ఈ వెబ్ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి మైదాల శృతి మాటల్ని రాయగా.. శ్రీ రామ్ మద్దూరి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రానికి చంద్రశేఖర్ జి.వి. ఎడిటర్‌గా, రామ్ కె మహేష్ కెమెరామెన్‌గా పని చేశారు. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.

తారాగణం :
రాజీవ్ కనకాల, వాసంతిక, ఉదయ్ భాను, గాయత్రి భార్గవి, హిమ బిందు తదితరులు

సాంకేతిక సిబ్బంది
నిర్మాత పేరు – కె.వి.శ్రీరామ్
ప్రొడక్షన్ హౌస్ – సౌత్ ఇండియా స్క్రీన్స్
దర్శకుడు – కృష్ణ పోలూరు
స్క్రీన్ ప్లే – కృష్ణ పోలూరు
డైలాగ్ రైటర్ – మైదాల శృతి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – శ్రీ రామ్ మద్దూరి
ఎడిటర్ – చంద్రశేఖర్.జి.వి
సినిమాటోగ్రాఫర్ – రామ్ కె మహేష్

TFJA

Recent Posts

నవంబర్ 12న ‘అ (AH)’ చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ నిర్మాత వంశీ నందిపాటి

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి,…

5 hours ago

“సమ్మర్ హాలిడేస్” పిల్లల సినిమా కాదు పిల్లలు నటించిన పెద్దల సినిమా, ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ – డైరెక్టర్ శ్రీకర్ నయన్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…

5 hours ago

అంగరంగ వైభవంగా SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో & “చాణక్య” టీజర్ లాంచ్

SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో అత్యంత ఘనంగా నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్…

5 hours ago

2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న డైరెక్టర్ పా.రంజిత్ భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ “వేట్టువం”

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో…

1 day ago

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,#RC17 # RC2Sukku ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…

1 day ago

నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి

నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి.…

3 days ago