సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ “కపుల్ ఫ్రెండ్లీ” టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా గురించి తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్. ఇవన్నీ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టాయి. దీంతో “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకు టికెట్ బుకింగ్స్ బాగా పెరిగాయి. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. సెకండ్ వీక్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేయనుంది.
“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.
నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…