ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, హెచ్.వినోద్ ‘ #RKFI52 లో జాయిన్ అయిన కమల్ హాసన్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో RKFI ప్రొడక్షన్ నంబర్ 52ని ప్రజంట్ చేస్తోంది. ప్రముఖ తారాగణం, సిబ్బందితో కూడిన ఈ చిత్రం వారి గత బ్లాక్‌బస్టర్ ‘విక్రమ్’ తర్వాత RKFI నుండి మరపురాని చిత్రాల్లో ఒకటిగా ఉంటుందని భరోసా ఇస్తుంది.
దిగ్గజ నటుడు, దర్శకుడు , నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో ఎన్నో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రతిభని స్వీకరించడం, ఉన్నత వినోద విలువలతో నాణ్యమైన చిత్రాలను రూపొందించడానికి సహకరించడం అత్యవసరం. నేను నా అనుభవాన్ని పంచుకోవడానికి, అలాగే కొత్త విషయాలను తెలుసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ ప్రతిభావంతులతో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. వినోద్ సృజనాత్మకత, కంటెంట్ పట్ల నిబద్ధత కలిగి వున్న దర్శకుడు. కమర్షియల్‌గా సక్సెస్ తో పాటు సామాజిక ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీశారనే పేరు తెచ్చుకున్నారు. RKFI 52 కూడా ఇలాంటి కలయికలోనే ఉంటుంది. చిత్రానికి ఈ కథ అందిస్తున్నందుకు చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను’’ అన్నారు.
దర్శకుడు హెచ్.వినోద్ తన ఆనందాన్ని పంచుకుంటూ, “ఇది నాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్, ఉలగనాయగన్ కమల్ హాసన్ తో కలిసి పనిచేయడం , KH 233 (RKFI 52) కోసం ఆయన కథ అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కమల్ సర్ సినిమాలు చూస్తూ ఎన్నో అంశాలు నేర్చుకోవచ్చు. ఆయన మానవతా ఆలోచనలు, సామాజిక స్పృహ,చేపట్టిన ప్రతి పనిలో రాణించాలనే తపన నిజంగా స్ఫూర్తిదాయకమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రత్యేకమైన , ఆకర్షణీయమైన కథకి జీవం పోయడం మా లక్ష్యం’’ అన్నారు
RKFI ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలని నిర్మిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ నటిస్తున్న KH 234, శివకార్తికేయన్ , సాయి పల్లవి నటిస్తున్న RKFI 51, శిలంబరసన్ ప్రధాన పాత్రలో RKFI 56 చిత్రాలు రూపొందుతున్నాయి.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…