RKFI52 లో జాయిన్ అయిన కమల్ హాసన్  

Must Read

ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, హెచ్.వినోద్ ‘ #RKFI52 లో జాయిన్ అయిన కమల్ హాసన్  

సక్సెస్ ఫుల్ డైరెక్టర్  హెచ్.వినోద్ దర్శకత్వంలో RKFI ప్రొడక్షన్ నంబర్ 52ని ప్రజంట్ చేస్తోంది. ప్రముఖ  తారాగణం, సిబ్బందితో కూడిన ఈ చిత్రం వారి గత బ్లాక్‌బస్టర్ ‘విక్రమ్’ తర్వాత RKFI నుండి మరపురాని చిత్రాల్లో ఒకటిగా ఉంటుందని భరోసా ఇస్తుంది.  

దిగ్గజ నటుడు, దర్శకుడు , నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ  ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో ఎన్నో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రతిభని స్వీకరించడం, ఉన్నత వినోద విలువలతో నాణ్యమైన చిత్రాలను రూపొందించడానికి సహకరించడం అత్యవసరం. నేను నా అనుభవాన్ని  పంచుకోవడానికి,  అలాగే కొత్త విషయాలను తెలుసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ ప్రతిభావంతులతో కలసి పని చేయడానికి  ఎదురుచూస్తున్నాను. వినోద్ సృజనాత్మకత, కంటెంట్ పట్ల నిబద్ధత కలిగి వున్న దర్శకుడు. కమర్షియల్‌గా సక్సెస్‌ తో పాటు సామాజిక ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీశారనే పేరు తెచ్చుకున్నారు. RKFI 52 కూడా ఇలాంటి కలయికలోనే ఉంటుంది. చిత్రానికి ఈ కథ అందిస్తున్నందుకు చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను’’ అన్నారు.

దర్శకుడు హెచ్.వినోద్ తన ఆనందాన్ని పంచుకుంటూ, “ఇది నాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్,  ఉలగనాయగన్ కమల్ హాసన్‌ తో కలిసి పనిచేయడం , KH 233 (RKFI 52) కోసం ఆయన  కథ అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కమల్ సర్  సినిమాలు చూస్తూ ఎన్నో అంశాలు నేర్చుకోవచ్చు.  ఆయన మానవతా ఆలోచనలు, సామాజిక స్పృహ,చేపట్టిన ప్రతి పనిలో రాణించాలనే తపన నిజంగా స్ఫూర్తిదాయకమైనవి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రత్యేకమైన , ఆకర్షణీయమైన కథకి జీవం పోయడం మా లక్ష్యం’’ అన్నారు
RKFI  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలని నిర్మిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ నటిస్తున్న KH 234, శివకార్తికేయన్ , సాయి పల్లవి నటిస్తున్న RKFI 51, శిలంబరసన్ ప్రధాన పాత్రలో RKFI 56 చిత్రాలు రూపొందుతున్నాయి.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News