వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటూ ..తనదైన క్రేజ్, ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఈయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.మీనాక్షి చౌదరి ఇందులో అడివి శేష్ జోడీగా నటించింది. నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ అందరి అటెన్సన్‌ను సంపాదించుకుంది. గురువారం రోజున చిత్ర యూనిట్ ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజైంది. హైదరాబాద్‌లో మూడు కాలేజీలకు చెందిన విద్యార్థుల సమక్షంలో పాటను విడుదల చేశారు.
సిద్ శ్రీరామ్ అద్బుతమైన గొంతు వీనుల విందుగా ఉంది. అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. కూల్ పోలీస్ ఆఫీసర్ కె.డి .. ఆర్యపై ఉన్న ప్రేమను పాట ఎలివేట్ చేస్తుంది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ మెలోడీ ట్యూన్‌కి కృష్ణ కాంత్ బ్యూటీఫుల్ లిరిక్స్ అందించారు. సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. హోమీసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్‌లో కూల్ కాప్ అయిన కె.డి అనే పోలీస్ ఆఫీసర్‌గా అడివి శేష్ కనిపించబోతున్నారు. ఇంకా రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా హిట్ 2 రిలీజ్ అవుతుంది.
నటీనటులు:
అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: నాని
బ్యానర్ : వాల్ పోస్టర్ సినిమా
ప్రొడ్యూసర్: ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం: డా.శైలేష్ కొలను
సినిమాటోగ్రఫీ: మణి కందన్.ఎస్
ఆర్ట్: మనీషా ఎ.దత్
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం
పి.ఆర్.ఒ: వంశీ కాక
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…