హిట్ 2’ నుంచి వీడియో సాంగ్ ‘ఉరికే ఉరికే.. విడుదల

Must Read

వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టిస్తూ.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ..త‌న‌దైన క్రేజ్‌, ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో అడివి శేష్‌. ఈయ‌న హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.మీనాక్షి చౌద‌రి ఇందులో అడివి శేష్ జోడీగా న‌టించింది. నాని స‌మ్ప‌ర‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ అంద‌రి అటెన్స‌న్‌ను సంపాదించుకుంది. గురువారం రోజున చిత్ర యూనిట్ ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజైంది. హైద‌రాబాద్‌లో మూడు కాలేజీల‌కు చెందిన విద్యార్థుల స‌మ‌క్షంలో పాట‌ను విడుద‌ల చేశారు.

సిద్ శ్రీరామ్ అద్బుత‌మైన గొంతు వీనుల విందుగా ఉంది. అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి మ‌ధ్య అద్భుత‌మైన కెమిస్ట్రీ కుదిరింది. విజువ‌ల్స్ వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. కూల్ పోలీస్ ఆఫీస‌ర్ కె.డి .. ఆర్య‌పై ఉన్న ప్రేమ‌ను పాట ఎలివేట్ చేస్తుంది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ మెలోడీ ట్యూన్‌కి కృష్ణ కాంత్ బ్యూటీఫుల్ లిరిక్స్ అందించారు. సాంగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.  హోమీసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీమ్‌లో కూల్ కాప్ అయిన కె.డి అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా అడివి శేష్ క‌నిపించ‌బోతున్నారు. ఇంకా రావు ర‌మేష్‌, శ్రీనాథ్‌ మాగంటి, కోమ‌లి ప్రసాద్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా హిట్ 2 రిలీజ్ అవుతుంది.

httpv://www.youtube.com/watch?v=A3Im3P0–aE

న‌టీన‌టులు:

అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లి ప్ర‌సాద్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌:  నాని
బ్యాన‌ర్ :  వాల్ పోస్ట‌ర్ సినిమా
ప్రొడ్యూస‌ర్‌:  ప్ర‌శాంతి త్రిపిర్‌నేని
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  డా.శైలేష్ కొల‌ను
సినిమాటోగ్ర‌ఫీ:  మ‌ణి కంద‌న్‌.ఎస్‌
ఆర్ట్‌:  మ‌నీషా ఎ.ద‌త్‌
ఎడిటింగ్:  గ్యారీ బి.హెచ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఎస్‌.వెంక‌ట్ ర‌త్నం
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News